BrahmaMudi: బ్రహ్మముడి సీరియల్ లో, రాహుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు శ్రీకర్ కృష్ణ. బ్రహ్మముడి సీరియల్ మాటీవీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరూ వారి వారి క్యారెక్టర్స్ కి తగినట్టుగా నటించి ప్రేక్షకు ఆదరణ పొందుతున్నారు. స్టార్ మా లో కార్తీకదీపం ఎంత ఫేమస్ అయిందో అదే టైమింగ్ లో వచ్చిన బ్రహ్మముడి కూడా అంతే ఫేమస్ అయింది అని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్ లో రాహుల్ క్యారెక్టర్ లో చేస్తున్న శ్రీకర్ కృష్ణ, తన కెరీర్ ను మెజీషియన్ గా ప్రారంభించాడు. ఇతను 2019లో స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన కెరియర్ను బుల్లితెర మీద పరిచయం చేశాడు శ్రీకర్. స్టార్ మా మహోత్సవం, కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా అలరించాడు. శ్రీకర్ తెలుగు సినిమాల్లో కూడా కొన్నిట్లో కనిపించి అభిమానుల్ని మెప్పించాడు నరసింహపురం చిత్రంలో తన నటనను అందరికీ పరిచయం చేశాడు.

శ్రీకర్ జీ తెలుగులో కళ్యాణం వైభోగం సీరియల్ తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగు పెట్టాడు ఆ తర్వాత శతమానం భవతి ఈటీవీ సీరియల్ లో ఆ తర్వాత బ్రహ్మముడి స్టార్ మా సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ ప్రోగ్రాంలో తన మనసులో మాటని బయట పెట్టాడు శ్రీకర్.. సెలబ్రిటీస్ కి తమ జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి వాటిని అధిగమించి జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు అలాంటి వాళ్లలో శ్రీకర్ కూడా ఒకరు. బ్రహ్మముడి సీరియల్ లో ప్లే బాయ్ క్యారెక్టర్ లోను, ఒక్కొక్కసారి కామెడీ చేస్తూ అమ్మాయిలు వెంట తిరుగుతూ ఉండే క్యారెక్టర్ గా, విలన్ క్యారెక్టర్ లాగా ఇలా వేరియేషన్స్ చూపిస్తూ శ్రీకర్ ఈ సీరియల్ లో అద్భుతంగా నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదివారం ఈటీవీలో వచ్చే ప్రోగ్రాం ఈ షోలో సందడి చేసిన శ్రీకర్, విక్రమ్ నటించిన ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా అనే పాటను, పాడతారు. ఆ తరువాత ఈ పాటనే ఎందుకు పాడారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమానంగా, నేను ఒక అమ్మాయిని మూడు సంవత్సరాలు ప్రేమించాను ఆ తర్వాత అనుకోకుండా ఒక రోజు తనకు పెళ్లి కుదిరింది అనే విషయం తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఎవరు అని, మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా నాతో మాట్లాడింది. ఇక అప్పటినుంచి నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను అని సమాధానం చెప్తాడు శ్రీకర్ ఆ మాటలు విని యాంకర్ గా చేస్తున్న రేష్మి అక్కడ జడ్జిగా ఉన్న ఇంద్రజ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పొచ్చు. శ్రీకర్ అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా లైఫ్ లో సుఖం దుఖం రెండు ఉంటాయి .కొన్నిసార్లు నేను ఒక డిప్రెషన్ లోకి వెళ్లి ఒంటరిగా ఉండేవాణ్ణి అని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు నేను నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను నేను పూర్తిగా మారిపోయాను గతంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా నేను ఇప్పుడు ఉండాల్సి వస్తుంది. ఇలా ఉంటేనే చాలా బాగుంది ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను బ్రహ్మముడి సీరియల్ ద్వారా నాకు చాలామంది అభిమానులు ఉన్నారని అర్థమైంది ఇలాంటి అభిమానుల్ని సంపాదించుకోవడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక ఈ కథను హిట్టు చేసినందుకు ఈ సీరియల్ ని అందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతాడు.