GuppedanthaManasu:గుప్పెడంత మనసు సీరియల్ ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మా సీరియల్స్ అన్నిట్లో కంటే గుప్పెడంత మనసు సీరియల్, ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. సీరియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతూనే ఉంది.ఇక ఈ సీరియల్ లో రిషి వసుధర క్యారెక్టర్లకు ఎంత ఇంపార్టెంట్ ఉందో అలానే జగతి క్యారెక్టర్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు డైరెక్టర్. ఈ సీరియల్లో జగతి క్యారెక్టర్ ఆడియన్స్ కు ఎంతో దగ్గర అయిందని చెప్పవచ్చు. మొదట్లో ఈ సీరియల్ ఒక లవ్ స్టోరీ గా యూత్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకున్నారు కానీ జగదీ క్యారెక్టర్ రోజుకి తన ఇంపార్టెంట్ పెరిగి, తెలుగు ఆడియోస్ అందరినీ అలరించిందని చెప్పవచ్చు. ముఖేష్ గౌడఈ సీరియల్ లో రిషి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.ఇతని తల్లిగానే జగతి క్యారెక్టర్ లో జ్యోతి రాయి నటిస్తుంది. ఇక ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ ఏమీ ఉండదు ఇంకా చెప్పాలంటే కార్తీకదీపం లో సౌందర్య పాత్ర తర్వాత అంత హుందాగా అందంగా ఉండే పాత్ర ఏదైనా ఉందంటే అది గుప్పెడంత మనసులో జగతి ఏదీ అని చెప్పవచ్చు. 1987 జులై 4వ తేదీన కర్ణాటకలో జన్మించిన జ్యోతి రాయ్. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న జగతి గుప్పెడంత మనసు సీరియల్ కన్నా ముందు నిరూపం హీరోగా నటించిన కన్యాదానం సీరియల్ లో నటించిన చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ లో తల్లి పాత్రలో అలరిస్తూ ప్రేక్షకులకు చేరువైంది జ్యోతి. చిన్నప్పటినుండి సినిమాలు మీద ఉన్న శ్రద్ధతో ఆమె నటన వైపు అడుగులు వేసింది పలు కన్నడ సీరియల్స్ కన్నడ సినిమాలోని నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అసలు విషయానికొస్తే ఈమెకు పద్మనాభ అనే ఒక వ్యక్తితో 20 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొన్ని కారణాలవల్ల ఈమె తన భర్తకు దూరంగా ఉంటుంది. కానీ తన బాబుని మాత్రం తనతోనే ఉంచుకుంది.ఇక ఈమె రీసెంట్ గా ఒక డైరెక్టర్ తో ప్రేమలో పడింది అని అంటున్నారు. ఈమె కొంతకాలంగా సుకు పూర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉంటుంది ఇద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు కూడా ఈమె తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు తన కొడుకు పుట్టినరోజు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను తన అభిమానులతో పంచుకుంది జ్యోతి. ఈమె కొడుకు పేరు ఉర్విష్ ఈరోజు అతని పుట్టిన రోజు, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉరివేష్ 11 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా, జ్యోతి రాయి పుట్టినరోజు వేడుకలను మరియు తను పెళ్లి చేసుకోబోతున్న డైరెక్టర్ తో మరియు తన కొడుకుతో ఇద్దరితో కలిపి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందించింది.

ఇప్పుడు ఆ ఫొటోస్ ను జ్యోతి అభిమానులు కొంతమంది పాజిటివ్ గానూ కొంతమంది నెగటివ్ గానూ కామెంట్స్ పెడుతున్నారు.కొంతమంది మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అలానే సంతోషంగా ఉండండి అని పెడుతుంటే కొంతమంది ఈ వయసులో అంత చిన్న డైరెక్టర్ తో పెళ్లి చేసుకోవడం ఏంటి అది కూడా కొడుకుని పక్కన ఉంచుకో పెట్టుకొని ఫొటోస్ తీయడమేంటి అని నెగటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. కానీ అసలు ఆమె పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం. తను సంతోషంగా ఎక్కడ ఉండాలన్న ఉండే రైట్స్ ఆమెకు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది అభిమానులు ఆమెకుసపోర్ట్ గా ఉంటున్నారు.ఏది ఏమైనా ఈమె ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మరికొన్ని తెలుగు సీరియల్స్ లో నటించాలని తెలుగు ఆడియోస్ని మెప్పించాలని ఆమె తీయబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ అన్ని హిట్ అవ్వాలని మనము కోరుకుందాం..
