Malli Nindu Jabili: మల్లి సీరియల్ లో మాలిని క్యారెక్టర్ లో దీపా జగదీష్ నటిస్తోంది. ఈ సీరియల్లో మాలిని క్యారెక్టర్ కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ ఉన్న క్యారెక్టర్. ఒక మోడ్రన్ అమ్మాయి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, వేరే అమ్మాయితోపెళ్లి అయిందని తెలిసి,తన భర్తను దక్కించుకునే పాత్రలో దీప జగదీష్ అద్భుతంగా నటిస్తుందని చెప్పొచ్చు. ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరూ వారి వారి క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటిస్తూ సీరియల్ ని టాప్ రేటింగ్ లో దూసుకుపోయేటట్టు చేస్తున్నారు. ఈ సీరియల్ లో గౌతమ్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీరియల్ వేరే లెవెల్ లోకి వెళ్ళింది. దీపా జగదీష్ మాలిని పాత్రలో అద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈమె కన్నడ నటి. ఈమె చేసిన ఒక పనికి ఇప్పుడు అందరూ ఈమెని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..

దీపా జగదీష్ షూటింగ్లో భాగంగా బెంగళూరులో ఒకచోట షూటింగ్లో పాల్గొన్నంగా, అక్కడ జరిగిన ఒకసంఘటనను తన కెమెరాతో బంధించి దానిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మానవత్వం ఇంకా ఉంది అని చెప్పడానికి దీపా జగదీష్ చేసిన పనిఅందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.ఆమె చేసిన పని వల్ల ఒక మూగ జీవి ప్రాణాలనుదక్కించుకుందని చెప్పొచ్చు.ఇప్పుడున్న సమాజంలో ఎవరికి వారు వారి పనుల్లో బిజీగా ఉంటారు కానీ పక్కన ప్రమాదంలో ఉన్న మనిషిని గురించి కూడా ఎవరూ పట్టించుకోరు కానీ దీపా జగదీష్ ఒక మూగ జీవి గురించి ఆలోచించి తన ప్రాణం కాపాడినందుకు జనాలు దీప అభిమానులు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు.

అసలు ఆమె కాపాడిన మూగజీవి ఏమిటో తెలుసా ఒక గుర్రం. అవును ఒక గుర్రం నీ ఇద్దరు వ్యక్తులు బలవంతంగా కర్రలతో కొడుతూ దాని దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే అదంతా ఒక వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీప ఇప్పుడు ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం. ఈ సంఘటన నిన్న బెంగళూరులో జరిగింది ప్రత్యేకంగా నేలమంగళ మహాదేవరా హసన్ హైవేలో పెంపుడు జంతువుల దశావతార ఇంటి పక్కన నేను మధ్యాహ్నం మరియు సాయంత్రం ఏరియాలో షూటింగ్లో ఉన్నాను దురదృష్టవశాత్తు ఈ వ్యక్తులు గుర్రాన్ని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ హింసిస్తూ ఉండడం నాకంట పడింది. ఏ జీవి అయినా కూడా దానికి దాన్ని క్రూరంగా ప్రవర్తించే పరిస్థితిని నేను చూసి తట్టుకోలేకపోయాను ఇటువంటి ప్రవర్తన అమ్మ అనవీయమైనది మరియు త్రిపుర ఆందోళన కలిగిస్తుంది నేను వెంటనే కొంతమంది అధికారులను మరియు ప్రెస్వాలను మీడియా వాళ్లకి కొంతమంది నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేశాను. ఈ గుర్రాన్ని హింసిస్తున్న వ్యక్తి దశావతారాలు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అని దీప తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఉదయం తన పోస్ట్ చేసిన తర్వాత సాయంత్రం కళ్ళ పీఎఫ్ ఏ యాంటీ యనిమల్ ఆఫీసర్ ఆమె పోస్టుకు స్పందించి ఆ గుర్రాన్ని దాని సేఫ్ ప్లేస్ కి పంపించారు. ఇప్పుడు అలా చేసినందుకు ఆఫీసర్ కి దీపా జగదీష్ థాంక్స్ చెప్పింది. ఆ ఆఫీసర్ తో పాటు నెట్ జనులందరూ కూడా దీపా చేసిన పనికి తనని కాంప్లిమెంట్స్ తో ముంచేస్తున్నారు. ఇలాంటి పనులు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలని మనం కూడా ఇలాంటి ఏవైనా మనకు ఎదురుపడితే ధైర్యంగా ముందుకు నిలబడాలని దీపా మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది సో దీపా జగదీష్ గ్రేట్..
