యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రీసెంట్గా `లాల్ సింగ్ చద్దా` మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. హాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన `ఫారెస్ట్ గంప్`కు రీమేగా ఈ చిత్రాన్ని రూపొందించారు
ఇందులో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్గా నటిస్తే.. అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించాడు. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఆగస్టు 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుండే ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. టాక్ అంతంత మాత్రంగా ఉండటంతో.. ఆ ప్రభావం కలెక్షన్స్‌పై భారీగా పడింది.
ఆమిర్ గత చిత్రాలతో పోలిస్తే తొలి రోజు చాలా తక్కువ వసూళ్లు రాబట్టిందీ మూవీ. అలాగే ఇందులో బోడి బాలరాజుగా నటించిన చైతూకు కూడా పెద్దగా గుర్తింపు ఏమీ దక్కలేదు. సినిమాలో ఆయనదొక పాత్ర అంతే అన్నట్లుగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. `లాల్ సింగ్ చద్దా`లో నాగ చైతన్య పోషించిన పాత్ర కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలని భావించారట.
ఈ నేపథ్యంలోనే ఆయన్ను సంప్రదించగా.. ఆమిర్ ఖాన్ పట్ల అభిమానంతో విజయ్ సేతుపతి ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అయితే షూటింగ్ సమయానికి విజయ్ సేతుపతి డేట్స్ సర్దుబాటు కాలేదట. ఇక అప్పుడు చేసేదేమి లేక విజయ్ సేతుపతికి బదులుగా చైతూ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. దీంతో `లాల్ సింగ్ చద్దా` వంటి బిగ్ ఫ్లాప్ నుండి విజయ్ సేతుపతి తప్పించుకుంటే చైతు అడ్డంగా బుక్కైయ్యాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!