Satyabhama:ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ జోడి వేద-యష్ లకు మంచి క్రేజ్ ఉంది. ఈ సీరియల్ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యి ఒక వెలుగు వెలిగింది. ఈ సీరియల్లో వేద కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ యూత్ ని బాగా కనెక్ట్ అయింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే అన్ని సీరియస్ కన్నా ఈ సీరియల్ రొమాంటిక్ సీరియల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ అయిపోయినందుకు అంతా చాలా బాధపడ్డారు.

సినిమాల్లో హీరో హీరోయిన్స్ ఒకటికి రెండుసార్లు రిపీట్ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది. అలా చేయడం కుదురుతుంది కూడా కానీ సీరియల్స్ లో మాత్రం ఒక హీరో హీరోయిన్స్ రెండో సీరియల్ చేయడానికి తొందరగా ఇష్టపడరు. అది కుదరదు కూడా, దానికి ఎగ్జాంపుల్ కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా నిరూపం వంటలక్కగా ప్రేమి విశ్వనాథన్ జోడి మళ్లీ కావాలని అభిమానులు అప్పట్లో తెగ గోలు చేశారు. కానీ ఇప్పటివరకు అలాంటి సీరియల్ ఏదీ పట్టాలు ఎక్కినట్టు దాఖలా లేదు. ఇలా సూపర్ హిట్ అయిన సీరియల్స్ మళ్లీ రిపీట్ కావాలని ఆ జోడి మళ్లీమళ్లీ చూడాలని అభిమానులు అనుకున్న అది అన్ని విధాలా డైరెక్టర్ కి కుదరకపోవచ్చు. కానీ స్టార్ మా లో టెలికాస్ అయినటువంటి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కూడా అలానే అందరూ అనుకున్నారు. ప్రేక్షకులు మాత్రం మళ్లీ వేదాన్ని యష్ని ఒకే స్క్రీన్ మీద చూడాలని తెగ ఆరాటపడ్డారు. వాళ్ళ ఆరాటం చాలా తొందరగా తీరిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మళ్లీ అదే జోడి స్టార్ మా లో ఇంకో సీరియల్లో మనకి కనిపించబోతున్నారు.

ఇక ఇప్పుడు క్రిష్ -సత్యభామ గా మనమెందుకు రాబోతున్నారు నిరంజన్, దెబ్జానీ మోదక్, ఈ కొత్త సీరియల్ లో క్రిష్ గా నిరంజన్ నీ పరిచయం చేస్తూ ఒక ప్రోమో వదిలారు. ఒక వారం క్రితం సత్యభామ సీరియల్ లో సత్యభామ క్యారెక్టర్ గా మోదక్ ని పరిచయం చేస్తూ ఒక ప్రోమో వదిలారు. ఇందులో హీరోయిన్ సత్యభామగా కొంచెం కోపంగా, అమ్మాయిలు పట్ల జరిగే, అన్యాయాలను ఎదిరించడానికి సత్యభామగా మన ముందుకు వస్తున్నట్లు ప్రోమోలో చూపిస్తారు .
అట్లానే ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోలో క్రిష్ రౌడీ బాయ్ లాగా కనిపిస్తాడు. కాలేజీలో రౌడీలకు గొడవ జరుగుతుంటే క్రిష్ వాళ్ళని కొడుతూ ఉంటాడు అప్పుడే వేదా ఎంట్రీ ఇచ్చి ఇది కాలేజీ అనుకున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా ఇక్కడ కొట్టుకుంటున్నారు ఏంటి అని అంటుంది క్రిష్ ఆ మాటలు పట్టించుకోకుండా సత్యభామ ని పట్టుకొని అట్లానే ఫైటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఇక తర్వాత వేదా కళ్ళల్లోకి చూస్తూ అలా ఉండిపోతాడు ఇక వేద వెళ్లిపోతున్నప్పుడు హే పిల్ల నచ్చావ్ ఫిక్స్ అయిపోయాను అంటూ డైలాగ్ కొడతాడు ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ యష్ ని కొంచెం కొత్తగా చూపిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నారు. ఇక మళ్ళీ వాళ్ళ ఫేవరెట్ జోడి ఇంత తొందరగా సీరియల్ గా అభిమాని ముందుకు వస్తున్నందుకుప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.ఇంకా ఈ సీరియల్ నిర్మాత డాక్టర్ బాబాయి అవడం మరో విశేషం. అదేనండి ఈ సీరియల్ నిర్మాత మన నిరూపమ్ పరిటాల.ఇప్పుడు ఈ విషయాన్ని నిరుపంతని ఇంస్టాగ్రామ్లో ప్రోమోని పోస్ట్ చేసి, ఆదరించాలంటూ షేర్ చేశాడు.