NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Heroine: ఇండియన్ చిత్ర పరిశ్రమలో కొంతమంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ ఆస్తులను పెంచుకుంటున్నారు. వరుస సక్సెస్ లు పడితే కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో మంచి స్టార్డం ఉండి భారీగా డబ్బు సంపాదించిన హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. అందులో మనందరికీ ఎక్కువగా తెలిసిన వారు ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే. ఇక రేఖ మరియు శ్రీదేవి వంటి అలనాటి నటీనటులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే వీరందరి కంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన హీరోయిన్ మరొకరు ఉన్నారు.

interesting news about senior heroine Jayalalitha
interesting news about senior heroine Jayalalitha

పదివేలకు పైగా చీరలు..1250 కిలోల వెండి.. 28 కిలోల బంగారం ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె మరెవ్వరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ జయలలిత. ఇక ఈమె ఒక హీరోయిన్ మాత్రమే కాదు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కూడా. నటిగా రాణించిన రాజకీయ నాయకురాలిగా ఎదిగిన జయలలిత భారత దేశంలోనే అత్యంత ధనవంతురాలైన నటిగా పేరు సంపాదించుకుంది. గూడచారి 116, చిక్కడు దొరకడు, సుఖ దుఃఖాలు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. 1997 నాటికి జయలలిత రాజకీయాల్లో బాగా స్థిరపడింది. ఆ సమయంలో చెన్నైలోని ఆమె పోయెస్ గార్డెన్ నివాసం పై అవినీతి నిరోధన అధికారులు దాడి జరిపారు. దాఖలు చేసిన అభియోగాల పత్రంలో.. జయలలితకు రూ. 188 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది.

నిజానికి ఆమె నికర సంపాదన విలువ రూ.900 కోట్లు వరకు ఉంటుందని అధికారులు ఆరోపించారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పరంగా.. ఈ విలువ ఇప్పుడు భారీగా ఉంటుంది. ఈ ఆస్తుల విలువ ప్రకారం రూ. 800 కోట్ల సంపద కలిగిన ఐశ్వర్య రాయ్ కంటే ఎక్కువ. ఇతర టాప్ ఇండియన్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా బట్ లు జయలలిత కంటే ఇప్పటికీ చాలానే వెనకబడి ఉన్నారు. అధికారులు జైలలిత ఇంట్లో 10,500 చీరలు, 750 జతల చెప్పులు, 91 గడియారాలు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016లో మరో దర్యాప్తులో ఈమె వద్ద 1,250 కిలోల వెండి.. 21 కిలోల బంగారం ఉన్నట్లు తెలిసింది.

ఇక జయలలితకు 8 లగ్జరీ కార్లు.. 42 కోట్లు విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. జైలలిత 1948లో మైసూర్ రాష్ట్రంలోని మాండ్యలో జన్మించారు. 1961 లో కన్నడ భాష చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయింది జయలలిత. అలా తన సినీ ప్రస్తావాన్ని మొదలుపెట్టి అనంతరం స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక సినిమాల్లో వచ్చిన గుర్తింపుతో ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టి అందులో కూడా సక్సెస్ అయింది. అలా అటు సినిమాలతో మరియు మరోపక్క రాజకీయాలతో రెండు చేతులు నిండా సంపాదించింది. ఇక ఇప్పటివరకు కూడా జయలలిత ఆస్తులను ఢీకొట్టే హీరోయిన్స్ పొట్ట లేదని చెప్పుకోవచ్చు. మరి రానున్న జనరేషన్లో జయలలిత ఆస్తులను ఢీకొట్టే నటీనటులు ఉంటారో లేదో చూడాలి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella