టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో రూపుదిద్దుకున్న తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ కలిసి హై బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ వార్త వైరల్‌గా మారింది.
అదేంటంటే.. వరల్డ్ వైడ్‌గా `లైగర్` మూవీకి ఏకంగా రూ. 100 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ న్యూస్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఒకవేళ ఈ వార్తే గనుక నిజమైతే విజయ్ దేవరకొండ క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయమవుతుంది.
కాగా, `లైగర్` చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. విజయ్ ఆ అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో చూడాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…