పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `హరిహర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అర్జున్ రామ్‌పాల్, నర్గిస్ ఫక్రి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ తన కెరీర్లోనే చేస్తున్న తొలి పీరియాడికల్ యాక్షన్ మూవీ ఇది. గత ఏడాదే ప్రారంభమైన ఈ చిత్రానికి మొదటి నుండీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా కొన్నాళ్లు .. పవన్ నిర్ణయాల కారణంగా కొన్నాళ్లు ఈ మూవీ షూటింగ్ కు బ్రేకులు పడుతూ వచ్చాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్ చేశారు.
ఆ ప్రేమ సహజమైనది.. పవన్‌పై `భీమ్లానాయక్` బ్యూటీ ఓపెన్ కామెంట్స్!
ఏమైందో తెలియదు కాని మళ్లీ ఆగిపోయింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పవన్ పొలిటికల్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ కారణంగా వీరమల్లుపై ఇంట్రస్ట్ చూపలేకపోతున్నాడు. అయినప్పటికీ క్రిష్ వెనక్కి తగ్గలేదట. చిత్రీకరణను డిలే చేయడానికి ఇష్టపడకపోవడంతో.. పవన్ దిగ్గొచ్చాడట.
ఆగస్టు నుండి వీరమల్లు షూటింగ్‌ను పునఃప్రారంభించమని చెప్పాడట. దీంతో ఆగస్టు రెండో వారం నుండి షూటింగ్ స్టార్ట్ చేసి.. నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ప్లాన్స్ చేస్తున్నారట. అలాగే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.