SFCS Award’s: ప్రపంచ సినిమా రంగంలో “RRR” ఒక సంచలనంగా మారింది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తరువాత ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రేక్షకులు మరియు ప్రముఖులు “RRR” సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కొన్ని దేశాలలో అయితే భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమాకి ఇవ్వని రీతిలో మీడియా కవరేజ్ కూడా ఇవ్వటం జరిగింది.
పలు ప్రముఖ మ్యాగ్జిన్ లలో ఈ సినిమాకి సంబంధించి ఆర్టికల్స్ కూడా రాసుకోవచ్చారు. విదేశాలలో “RRR” కి దక్కిన ఆదరణ మరో భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించి ఏ సినిమాకి కూడా దక్కలేదని చెప్పవచ్చు. దర్శకుడు రాజమౌళి పనితీరుని చాలామంది అభినందించారు. దీంతో పదం అంతర్జాతీయ సినిమా వారోత్సవాలకు… ఆహ్వానాలు కూడా జక్కన్న అందుకోవటం జరిగింది. ఇదే సమయంలో కొద్ది నెలల నుండి “RRR” పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు గెలుచుకోవడం జరిగింది.
వీటిలో రెండు ఎంఎం కీరవానికి మరొకటి దర్శకుడు రాజమౌళి కి వచ్చాయి. అయితే తాజాగా సియోటేల్ క్రిటిక్స్ అవార్డు “RRR”కి దక్కింది. ఈ విషయాన్ని సియోటేల్ క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి గాను ఈ అవార్డు రావడం జరిగింది. ప్రేమ్ రక్షిత్, దినేష్ కృష్ణన్ స్తంట్స్ కొరియోగ్రఫీ చేశారు. మరో నలుగురు కోఆర్డినేటర్లుగా పనిచేశారు. ఇదిలా ఉంటే ఇంకా బ్యాలెన్స్ ఉన్న ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కూడా వచ్చేస్తే బాగుంటుందని భారతీయ చలనచిత్ర ప్రముఖులు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.