Intinti Gruhalakshmi: నువ్వు సంపాదించిన డబ్బులతో అంకితని ఫారిన్ తీసుకెళ్తున్నావాని అనుకుంటుంది. ఇది నిజం కాదని అంకితకు తెలిస్తే తను ఫారన్ లో ఉన్నా కూడా తన ఇండియాకి తిరిగి వచ్చేస్తుంది.. నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు అని తులసి సలహా ఇస్తుంది ..శాపనార్ధాలు పెడుతున్నావా అని అభి తులసితో అంటాడు. నువ్వు అంకిత దగ్గర చులకన గా కాకుండా చూసుకోమని తులసి సలహా ఇస్తుంది..

తులసి తో పాటు కలిసి బయటకు వెళ్లాలి అని నందు డిసైడ్ అవుతాడు. తను తులసి కోసం తీసుకున్న నక్లేస్ ఎలా అయినా తనకి ఇవ్వాలి అని అనుకుంటాడు. అందుకు లాస్య తను తీసి పెట్టిన డ్రెస్లు కావాలని టీ పోసి అక్కడ పడేస్తాడు. నువ్వు నిదానంగా రెడీ అయి రా.. ఆ తరువాత నేను వస్తాను అని లాస్య అంటుంది. మెల్లగా నందు లాస్య నుంచి జారుకుంటాడు. తులసి నేను ఆఫీస్ కి వెళ్ళాలి. నా కార్ స్టార్ట్ అవ్వడం లేదు. అని తులసి వెళుతున్న బైక్ దగ్గరకు వచ్చి తనక్కూడా లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు. లాస్య టెర్రస్ మీద నుంచి నందు తులసి ఒకే బైక్ మీద వెళ్లడం చూస్తుంది..

నందు ఎందుకు తులసి బైక్ ఎక్కి వెళ్ళాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా తనకి తనుకొండ నక్లిస్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ అక్కడ కూడా కుదరదు. ఇక కేఫ్ కి రాగానే అక్కడ ఇద్దామనుకున్నాడు. కానీ డెకరేషన్ వాళ్ళు వస్తారు. ఆ లోపు లాసే వస్తుంది. ఏంటి ఈమధ్య బైక్ మీద బాగా కంఫర్ట్ గా ఉన్నట్టుగా ఉంది అని లాస్య అడుగుతుంది. ఏం జరుగుతుంది అని అడుగుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళ ఇంట్లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందులో భాగంగా సామ్రాట్ కూడా అక్కడికి వస్తారు. ముందుగా నందు లాస్య డాన్స్ చేసి.. లాస్య నందు గిఫ్ట్ గా నెక్లెస్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ శృతి కోసం కూడా ఒక గిఫ్ట్ తీసుకొస్తాడు. ఆ గిఫ్ట్ చూసి శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ అప్పుడే తులసిని ఒక చీటీ తీయమని అంటాడు. మాకంటే పార్ట్నర్స్ ఉన్నారు తులసికి పార్ట్నర్ లేరు గాని లాస్య అంటుంది. నాకు కూడా లైఫ్ పార్ట్నర్ ఉన్నారని తులసి చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి తులసి వైపు చూస్తారు.
