Intinti Gruhalakshmi: తులసి నందు కి వాసు సస్పెన్స్ రివీల్ చేస్తూ 28 సంవత్సరాల పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ వాసు ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతాడు. వాళ్ళిద్దరికీ మేటర్ తెలియకపోవడంతో ఇద్దరూ కాస్త రిలాక్స్ అవుతారు. తులసి కూడా ఎలాగైనా నందు నేను భార్య భర్తలు కాదు అన్న విషయాన్ని వాసు అన్నయ్యకి చెప్పాలని అనుకుంటుంది. ఇక ఉదయాన్నే లేచి తులసి గుడికి వెళుతుంది.

విక్రమ్ దివ్యని ఎలా కలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన పక్కన ఉన్న రాంబంటు ఎవరో ఒక పేషెంట్ ని మీతో పాటు తీసుకు వెళ్తే సరి కదా అని సలహా ఇస్తాడు. ఇక అదే ప్లాన్ ను తన మీదే ఇంప్లిమెంట్ చేస్తాడు. విక్రమ్ రాంపండును తీసుకొని దివ్య దగ్గరికి వెళ్తాడు. తను కట్లు కట్టి ఇంటికి కూడా పంపించేస్తుంది. మీ మంచితనానికి నేను ఫిదా అంటూ విక్రమ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది దివ్య. అవునా నిజంగానా నేను మీకు నచ్చేసాను అని విక్రమ్ అడుగుతాడు .అవునండి అని దివ్య చెబుతుంది .

ఇక గుడికి వెళ్ళిన తులసి దేవుడి దర్శనం కోసం క్యూ లైన్ లో చాలా సేపు నుంచి నిలబడి ఉంటుంది. మిగతా భక్తులు కూడా దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే రాజ్యలక్ష్మి వాళ్ళ తమ్ముడు అందరూ a
తప్పుకోండి మా అక్క వస్తుంది అంటూ హడావుడి చేస్తూ రాజ్యలక్ష్మి లోపలికి తీసుకువెళ్లబోతుండగా తులసి వచ్చి మామ ఎవరో తెలియకుండా రాజ్యలక్ష్మి వాళ్ళ తమ్ముడు తో గొడవ పడుతుంది. ఇక రాజ్యలక్ష్మి తులసిని చూసి ఇవేంటి ప్రతి విషయానికి నాకు అడ్డు వస్తుంది అనుకుంటుంది. ఇక తులసి రాజ్యలక్ష్మి చూసి గుర్తుపట్టి మీరు చాలా మంచివారు.. మీరు ఇలా చేయడం సరికాదు అని అనడంతో.. అందరిలాగా నేను లైన్లో నిలుచుంటాను అని రాజ్యలక్ష్మి అంటుంది. ఇక అంతలో పంతులుగారు వచ్చి గుడిలో పాట పాడుతూ గాని రమ్మని తులసిని తీసుకువెళ్తారు . ఇక రాజ్యలక్ష్మి దర్శనానికి వెళ్ళగా తను తీసుకోవాలని అనుకున్న హారతిని పంతులుగారు తులసికి వెళ్లి ఇస్తాడు. ఆ తరువాత తనకి ఇవ్వబోతుండగా వద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో రాజ్యలక్ష్మి తన బిడ్డ తన మాట వినడం లేదని శివుడికి భక్తితో నిష్టగా పూజిస్తుంది . పొద్దుటి నుంచి ఉపవాసం అని ఏమి తినలేదని అంటుంది. నీరసంగా కనిపిస్తుంది . తన కొడుకు తన మాట వినాలని వేడుకుంటుంది. అప్పుడే విక్రమ్ వచ్చి నేను నీ మాట వింటాను అని అనగానే అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అడగగా చేసుకుంటాను అని విక్రమ్ మాట ఇస్తాడు.