Intinti Gruhalakshmi: రేయ్ అన్నయ్య అమ్మా అందరి మాటలు విని కష్టమో నష్టమో మేనేజర్ పొజిషన్లో ఉండటానికి ఒప్పుకుంది.. తనని ప్రశాంతంగా ఆ జాబ్ చేసుకునేలాగా చూడనిచ్చే బాధ్యత కూడా మనదే.. అని అభితో ప్రేమ్, శృతి , అంకిత చెబుతారు.. నేను మీ అందరికీ అంత శత్రువులాగా కనిపిస్తున్నానా.. మామ్ ఎదగాలని నేను కోరుకుంటాను కదా అని అభి అంటాడు.. మీరందరూ మామ్ ఎదుగుదల కోసం కష్టపడుతున్నారు కానీ.. డాడ్ గురించి మాత్రం ఒక్కరు కూడా ఆలోచించడం లేదు అని అనగానే.. ఈ విషయంలో నా నిర్ణయాలు నాకు ఉన్నాయని ప్రేమ్ అంటారు.. ఇక మెల్లగా ఒక్కొక్కళ్ళు అక్కడ నుంచి జారుకుంటారు..!!

హనీనీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు.. హనీ ఇంకొన్ని రోజులు ఆ కట్టు అలాగే ఉంచమని చెబుతుంది.. తులసి ఇంట్లో ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తుంది.. వారి ఆప్యాయతలను సామ్రాట్ గమనిస్తూ ఉంటాడు. తులసి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది.. కానీ అందరికీ మంచి చేసే తులసికి మాత్రం ఆ దేవుడు ఎందుకు ఒంటరిని చేశాడు.. అర్థం కావడం లేదు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో అంటాడు..

అందరూ అక్కడ వుండగానే సామ్రాట్ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెడదాం.. మనం తులసివనం ప్రాజెక్టుని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నామని మీడియా వాళ్లకి చెప్పాలి అనే సామ్రాట్ అంటాడు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని తులసి అంటుంది.. కాదు కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని లాస్య కూడా ఉంటుంది.. ఆ ఏర్పాట్ల బాధ్యతలు చూడమని నందు, లాస్యకు అప్పుడు చెప్తాడు సామ్రాట్.. వెళ్ళిపోదాం లాస్య మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నందు అంటాడు.. అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు..

ఆ తులసిని ఇక్కడి నుంచి పంపించేలాగా ప్లాన్ చేయాలి అని లాస్య అంటుంది.. ఆలస్యం ఎందుకు త్వరగా ప్రెస్ వాళ్లకి కాల్ చేయమని లాస్య నందుకి చెబుతుంది.. ప్రెస్ మీట్ మనల్ని అరేంజ్ చేయమని తన గొయ్యి దానిని తవ్వుకున్నాడు సామ్రాట్.. ఎంచక్కా తులసితో ఇకక నవ్వుకుంటూ ప్రెస్ మీట్ ఇద్దామని అనుకుంటున్నాడు.. కానీ అక్కడ జరిగేది అది కాదు కొరివితో కోరుకున్నట్టు ఉంటుంది.. అక్కడ అని లాస్య తన ప్లాను నందుతో చెబుతుంది.. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టనురా అని అనుకుంటాడు.. పిచ్చి నందు ఈ రోజు సామ్రాట్ కి కనిపించేది చుక్కలే.. అని లాస్య తన ఫోన్ నుంచి ఎవరికో కాల్ చేసి చేయాల్సింది మొత్తం వివరంగా చెబుతుంది.. లాస్య దగ్గరుండి ప్రెస్ వాళ్లకి సేవలు చేస్తున నందు.. మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పిందంతా గుర్తుందిగా.. చేస్తారు కదా అని వాళ్ళని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది.. వాళ్లు కూడా సరే అన్నట్టుగా తల ఊపుతారు గుడ్ అని చెప్పి లాస్య అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది..

మామ్ మీతో కలిసి పని చేయదు అని అభి సామ్రాట్ తో అంటాడు.. మీ భార్య చనిపోయిందా లేదంటే మీరే వదిలేసారా లేదంటే చంపేశారా అని సామ్రాట్ ను అభి నీ నిలదీస్తాడు.. కచ్చితంగా చంపేశారు అని అభి అన్న మాటలను విని సామ్రాట్ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు సామ్రాట్ ని చూస్తూ తులసి కూడా ఏడుస్తుంది..
