Intinti Gruhalakshmi: మన కాలనీలో మొదటిసారి దసరా సంబరాలు చేస్తున్నారట.. అందుకు మనల్ని పిలవడానికి మన ఇంటికి వచ్చారు అని అనసూయమ్మ అంటుంది.. నాది ఏముంది తులసి వెనకమాల తోక ఊపుకుంటూ వెళ్లేదని అని అనసూయమ్మ చమత్కారం గా అంటుంది.. అమ్మ తులసి నీ కంటే ఈ కాలనీలో మీ అత్తయ్యకి ఎక్కువ మంది తెలుసు.. తనకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అని పరంధామయ్య అంటాడు.. అవునండి ఈ కాలనీకి పెద్దదిక్కు అనసూయమ్మ గారి ఆవిడ చేతులుగా మీతో గాని ఈ సంబరాలు జరగాలి అని వాళ్లంతా అంటారు.. .
సామ్రాట్ బాబు నువ్వేంటి ఇలా వచ్చావు.. నేనే నిన్ను కలిసి థాంక్యూ అని చెబుదాం అని అనుకున్నాను బాబు.. ఇంతలో నువ్వే వచ్చావు అని అనసూయమ్మ సామ్రాట్ తో అంటుంది.. అవును ఇంతకీ ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అనసూయమ్మ సామ్రాట్ అడుగుతుంది.. ఇప్పుడు తులసిని కలవడానికి ఇక్కడి వచ్చాను అని మీకు చెబితే అసలు ఊరుకోదు అని మనసులో అనుకొని.. ఒక ఫైల్ ఇక్కడే తులసి దగ్గర ఉండిపోయింది అది తీసుకుందామని వచ్చాను అని సామ్రాట్ అంటాడు.. అవునా మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లి తీసుకు వస్తాను అని అనసూయమ్మ అంటుంది.. ఇంకొక విషయం మా ఇంట్లో వాళ్లకి ఎవరికి గాని నేనే మిమ్మల్ని సహాయం అడిగినా విషయం చెప్పకూడదు అని కండిషన్ పెడుతుంది. మళ్లీ మీరు పదే పదే మా ఇంటి వైపు కూడా రావద్దు అని అనసూయమ్మ అంటుంది సరే అని సామ్రాట్ అంటాడు..
తులసి సామ్రాట్ అడిగిన ఫైల్స్ తీసుకుని వచ్చి నా దగ్గర ఉన్న ఫైల్స్ తో మీకు ఉపయోగం లేదు.. ఒకవేళ మీకు ఈ ఫైల్స్ తో అంత అవసరం ఉండి ఉంటే మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు.. ఎవరో ఒకరిని పంపించిన సరిపోతుంది అని తులసి అడుగుతుంది. అయినా మీరు ఎంత దూరం వీటి కోసమే వచ్చారని తులసి అనుమానంగా సామ్రాట్ ను అడుగుతుంది.. ఇక సామ్రాట్ ఏం చెబుతాడు అని తరువాయి భాగంలో చూద్దాం..