Gruhalakshmi Divya: ఈ మధ్య సినిమాల్లోనే కాదు.. సీరియళ్లలోనూ కొత్త తారలు తళుక్కుమంటున్నారు. ఇందులో కొంత మంది తెలుగు నటీమణులు అయితే.. మరికొందరేమో పక్క ఇండస్ట్రీలో మెరిగి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలుగు బుల్లితెరపై శోభా శెట్టి, తేజస్విని గౌడ, అమూల్య గౌడ, అర్చన అనంత్, మేఘనా లోకేశ్, కీర్తి కేశవ్ భట్ లాంటి స్టార్స్ బుల్లితెర అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో దివ్య పాత్రలో నటిస్తున్న ఇంచర శెట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. కన్నడ నుంచి తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ భామ తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. పాపులర్ హీరోయిన్‌గా ఆమె దూసుకెళ్తోంది.

Intinti Gruhalakshmi Divya Character Inchara Shetty: గృహలక్ష్మి దివ్య యాక్ట్రెస్ ఇంచారా శెట్టి
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో తులసి కూతురుగా ‘దివ్య’ అనే అల్లరి పిల్ల ఉండేది. ఆ పిల్ల పేరు పూజిత రెడ్డి. యూఎస్‌లో చదువు పేరుతో వెళ్లడంతో ఆమెను సీరియల్ నుంచి తొలగించి ఆమె స్థానంలో కన్నడ భామ ఇంచర శెట్టిని తీసుకున్నారు. కన్నడలో అనేక సీరియళ్లలో నటించిన ఇంచర శెట్టి ‘రాధిక’ అనే సీరియల్‌తో పాగా పాపులర్ అయింది. ఈ సీరియల్‌లో ‘గమ్య’ పాత్రలో కన్నడ ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత ‘కెండ సంపిగే’ అనే సీరియల్‌లో కీలక పాత్ర పోషించింది. ఆమె నటన తెలుగులోనూ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. తెలుగులో ఇంచర శెట్టి ‘ఇంటింటా గృహలక్ష్మి’ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్‌లో తులసి కూతురు దివ్య పాత్రలో మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ సీరియల్ ద్వారా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

Gruhalakshmi Divya: కథలో కంటే బయట చాలా కొంటె పిల్ల
2000 జనవరి 22న ఇంచర శెట్టి కర్ణాటకలోని మోదుబిద్రిలో జన్మించారు. ఇంచర తల్లిదండ్రులు ఆమెను సింగర్‌గా చూడాలని అనుకున్నారు. కానీ ఇంచర శెట్టికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువ. అందుకే చదువుకునే సమయంలో యాక్టింగ్‌లో జాయిన్ అయి నటనలో మెళుకువలు నేర్చుకున్నారు. కేరీర్ ప్రారంభంలో కొన్ని షార్ట్‌ఫిల్మ్‌లో కూడా ఇంచర నటించారు. షార్ట్‌ఫిల్మ్‌లతో ఫేమస్ అయిన ఇంచర శెట్టికి సీరియళ్లలో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

ఇంచర శెట్టి సీరియళ్లలో బిజీ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రాళ్లను అల్లాడిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇంచర శెట్టి తన డైలీ రొటిన్ అప్‌డేట్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే.. అప్పుడప్పుడు అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తుంటారు. ట్రెడిషనల్ లుక్‌తో పాటు మోడ్రల్ డ్రెస్సుల్లో అందాల విందు ఇస్తోంది.

తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చీరకట్టులో మెరిసింది. ట్రెడిషనల్ లుక్‌లో దేవతలా కనిపిస్తోంది. కైపెక్కించే చూపులతో అందానికే అసూయ పుట్టిస్తోంది. ఆకాశంలో ఉండే నక్షత్రం నేలను తాకినట్లుగా ఉంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవకన్య భూలోకానికి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.