NewOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: వచ్చేవారం సూపర్ ట్విస్ట్ లు ఇంటింటి గృహలక్ష్మి లో.!? 

Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights
Share

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. టీ ఆర్పీ రేటింగ్ లో కూడా ఇప్పటికే 780 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి 10.17 రేటింగ్ను సొంతం చేసుకుని మూడవ స్థానంలో నిలిచింది. గుప్పెడంత మనసు సీరియల్ కి ఇంటింటి గృహలక్ష్మి గట్టి పోటీని ఇస్తోంది. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Intinti Gruhalakshmi latest Episode Highlights on November
Intinti Gruhalakshmi latest Episode Highlights on November

అనసూయమ్మ , నందు, లాస్య ముగ్గురు తులసి నీ అనుమానిస్తారు. అక్కడే ఉంటే వాళ్ళు అనుకునే నిజాన్ని నిజం చేసినట్లు అవుతుందని తులసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. తను ఎప్పటికీ పవిత్రంగానే ఉంటాను అని తులసి మరోసారి నిరూపించింది. ఇక లాస్య అంతకంతకు తన ప్లాన్ అమలు చేస్తూనే ఉంటుంది.

Advertisements
Intinti Gruhalakshmi latest Episode Highlights on November
Intinti Gruhalakshmi latest Episode Highlights on November

తులసి ఆఫీస్ కి వెళ్తూ తన ఇంటి వైపు చూసింది. అక్కడే అనసూయమ్మ ఆగు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంది. అంతలో లాస్య వచ్చి ఈ పేపర్స్ మీద సైన్ చేయమని చూపిస్తుంది. మీ మావయ్య గారు నీ మీద ప్రేమ కొద్ది ఈ ఇంటిని నీకు రాసిచ్చారు కదా ఆ పేపర్స్. నువ్వే ఇంటిని కాదనుకొని వెళ్లిపోయినప్పుడు. ఈ ఇల్లు నీ పేరు మీద ఎందుకు వెంటనే అత్తయ్య పేరు మీద రాస్తున్నట్లు నువ్వు సంతకం చేయమని రాసి ఆ పేపర్లను చూపిస్తుంది. ఇక తులసి మరో మాట మాట్లాడుకుండా ఆ పేపర్స్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తుంది. తులసి ఆ కోపాన్ని ఆఫీసులో తన పిఏ మీద చూపిస్తుంది. సామ్రాట్ గారు.. ఈ జీవితం ఏమైనా శాశ్వతమా.. ఎందుకు కుళ్లు, కుతంత్రాలు, తోటి మనిషికి ప్రేమ పంచితే ప్రేమే తిరిగి వస్తుంది అంటారు. సారీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అని తులసి అంటుంది. ఏమైందో చెప్పండి అని సామ్రాట్ అడుగుతాడు.. మీ పేరు మీదున్న ఆస్తిని అడిగారా.. వాళ్ళు కావాలి అని అడిగితే నేను ప్రాణమైన ఇస్తాను అని తులసి అంటుంది. మా అమ్మకు చేసిన సేవలు కంటే మా అత్తయ్య కే ఎక్కువ సేవలు చేశాను అని తులసి అంటుంది. తులసి సంతకం చేసి ఇచ్చిన పేపర్స్ అనసూయమ్మ చేతికిచ్చి దండం పెట్టడం అనసూయమ్మ గుర్తు తెచ్చుకుంటుంది.

 

Intinti Gruhalakshmi latest Episode Highlights on November
Intinti Gruhalakshmi latest Episode Highlights on November

లాస్య ఆ పేపర్స్ ను అనసూయమ్మ చూడకుండా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకొని తన రూమ్ కి వస్తుంది లాస్య. ఈ పేపర్స్ ఎవ్వరికైనా పడకుండా చాలా జాగ్రత్తగా రాయాలి అని లాస్య అనుకుంటుంది. నేను రెచ్చగొడితే అత్తయ్య రెచ్చిపోయింది. తులసిని సంతకం చేయమంటే ఇట్టే సంతకం చేసింది.. నేను చేసిన అని నాకు ఈసారి బాగా కలిసి వచ్చాయి అని లాస్య మనసులో అనుకుంటుంది. ఇక ఈ పేపర్స్ ఎవరికన్నా పడకుండా జాగ్రత్త చేయాలి. ముఖ్యంగా నందు చూడకుండా ఈ పేపర్స్ దాయాలి అని లాస్య ఓ సీక్రెట్ లో ఆ పేపర్స్ దాస్తుంది. అప్పుడే నందు వచ్చి లాస్యను చూస్తాడు. ఇక నందు కి ఏదో ఒక అబద్ధం చెప్పి వాటిని దాచేస్తుంది లాస్య.

Intinti Gruhalakshmi latest Episode Highlights on November
Intinti Gruhalakshmi latest Episode Highlights on November

తులసి అద్దె ఇంటి కోసం వెతుకుతూ ఉంటుంది. మొత్తానికి ఓ ఇల్లంతా వెతికి అడ్వాన్స్ నెల రోజుల్లో ఇస్తాను అని కూడా చెబుతుంది. ఇంట్లో ఎంతమంది ఉంటారు అని ఆవిడ అడగగానే.. నేను మా అబ్బాయి ఇద్దరమే ఉంటామని తులసి చెబుతుంది. మీరు సింగిల్ ఆ అని ఇంటి ఓనర్ అడుగుతుంది. అవును అని తులసి సమాధానం చెబుతుంది. సింగిల్స్ కి మేము ఇల్లు అద్దెకి ఇవ్వము వెళ్ళిపోండి అని హౌస్ ఓనర్ కాస్త చులకనగా మాట్లాడుతుంది. సింగిల్స్ గా ఉండే వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. నీలాంటి వాళ్ళు ఆలోచన తీరు మార్చుకుంటే గాని సమాజం బాగుపడుతుంది.. సింగిల్ లేడీస్ మీద ఇలాంటి అనుమానాలు ఉండవు వస్తాను అని తులసి ఆవిడకి దండం పెట్టి ముందుకు వెళ్ళిపోతుంది..

 

ఇక తులసి టూలేట్ బోర్డు కనిపించిన ప్రతి ఇంటికి వెళ్లి అద్దెకు ఇల్లు అడుగుతుంది. సింగిల్స్ కి మేము ఇల్లు ఇవ్వము కాక ఇల్లు ఇవ్వమని అందరూ ఒకటే మాటను చెబుతారు. ఇక తులసి విసిగిపోయి ఉంటుంది. అప్పుడే సామ్రాట్ ఫోన్ చేస్తాడు తులసి గారు మీరు ఎక్కడున్నారు. సింగిల్ గా ఉన్నారా అని ఆ అనగానే.. సింగిల్ ఏంటి సింగిల్.. సింగిల్ మీకు అంత చులకనగా ఉందా అంటూ సామ్రాట్ పై ఫైర్ అవుతుంది. అద్దెకు అద్దె ఇల్లు వెతకడానికి వెళ్ళిన చోట తులసికి ఎదురైన చేదు అనుభవాలను సామ్రాట్ తో చెబుతుంది. అయితే రేపటి నుంచి మీతో పాటు నేను కూడా ఇల్లు వెతకడానికి వస్తాను సామ్రాట్ అంటాడు.

Intinti Gruhalakshmi latest Episode Highlights on November
Intinti Gruhalakshmi latest Episode Highlights on November

దివ్య తులసికి ఫోన్ చేస్తుంది ఇంత బాధపడుతూ నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటుంది. నా కారణంగా నువ్వు ఇల్లు వదిలేసి రావడం కరెక్ట్ కాదు ఆ ఇల్లు ముక్కలైందన్న అపవాదు నాకు వద్దు అని తులసి దివ్యతో చెబుతుంది. మళ్లీ మంచి రోజులు వస్తాయి అందరం ఒక్కటవుతాము అని తులసి అంటుంది. ఆశ పడుతున్నావా.. ఆశ పెడుతున్నావా మామ్ అని దివ్య అడుగుతుంది. ముందు ముందు తులసి ఇక ఒంటరిగానే ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఒంటరిగా బ్రతికి తన సత్తా ఏంటో అందరికీ అర్థమయ్యేలాగా చూపించాలి అని తులసి అనుకుంది. ఇక లాస్య కొట్టేసిన పేపర్స్ మ్యాటర్ పరంధామయ్యకు తెలుస్తుంది. మరోవైపు మాధవి కూడా నందుని చడమడ తిడుతుంది ఆ సీన్లని వచ్చేవారం హైలైట్ ట్విస్టులుగా మారనున్నాయి..


Share

Related posts

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా.!? తులసి బిజినెస్ ప్రపోజల్ నందు యాక్సెప్ట్ చేస్తాడా.!?

bharani jella

`లైగ‌ర్‌`కు షాక్ మీద షాక్‌.. అదే జ‌రిగితే పెద్ద దెబ్బ ప‌డ‌టం ఖాయం!

kavya N

`ఉప్పెన‌` డైరెక్ట‌ర్‌కు నో చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కార‌ణం అదేన‌ట‌!?

kavya N