Intinti Gruhalakshmi: తులసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. నువ్వు ఒడిపోలేదు అమ్మా.. నువ్వు నీ ఆత్మాభిమానం గెలుచుకుని ఇక్కడికి వచ్చావు అని వాళ్ళ అమ్మ అంటుంది.. ప్రేమ్ సామ్రాట్ ను చూస్తూ.. ఆలోచించకండి ఈ టైం లో అమ్మకు తోడుగా ఉండాల్సింది మీరే సార్.. రండి సార్ లోపలికి వెళ్దాం అని సామ్రాట్ తో ప్రేమ్ అంటాడు..
పరంధామయ్య తులసి గురించి ఆలోచిస్తూ తను ఏమీ తినకుండా అలాగే ఉంటాడు.. నందు అది చూసి అమ్మ దివ్య నువ్వంటే తాతయ్యకు చాలా ఇష్టం.. తాతయ్య చేత నువ్వే ఈ మెడిసిన్స్ వేయించాలి అని నందు చెబుతాడు.. తాతయ్య మీరు ముందు ఒక ముద్ద అన్నం తినండి అని దివ్య ప్లేటులో భోజనం తీసుకువెళ్తుంది.. మీరు తినకపోతే నా మీద ఒట్టే అని అంటుంది..
తులసి గారు అని సామ్రాట్ అంటాడు.. నేను బాగానే ఉన్నాను.. సారీ తులసి గారు ఇదంతా నా వల్లే జరిగింది అని అంటాడు.. ఎదుటివారు చేసినా తప్పులు నేను నా మీద వేసుకున్నాను.. చూశారుగా నా మంచితనానికి ఎలాంటి బహుమతి ఇచ్చారు.. నా వైపు ఎలాంటి తప్పులేదు.. నా మీద నిందలు వేశారు.. మాటలతో గుచ్చి గుచ్చి చంపారు.. ఇన్నేళ్లుగా ఎదురు తిరగని నేను.. మొట్టమొదటిసారి నా కోసం నేను నిలబడితే.. మీ మాటలు పట్టించుకోను అని నేను ఎదురు తిరిగితే అదేదో రాజ ద్రోహం లాగా చూస్తున్నారు.. గంగ లో మునిగిన నేను పునీతురాలిని కాలేను అని వాళ్ళు అనుకుంటున్నారు.. వాళ్లు అనుకున్నదే నిజం అనుకుంటే నా మీద బురద చల్లుతున్నారు.. నా ఇంట్లో వాళ్ళు నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను నిందిస్తున్నారు.. నాకు జన్మనిచ్చిన తల్లి.. నా బొడ్డు తెంపుకు బిడ్డ.. నా స్నేహితుడికి తెలుసు నేను తప్పు చేయలేదని అలాంటప్పుడు నేనెందుకు రాజీ పడాలి.. నేను యుద్ధం చేస్తాను అని తులసి అంటుంది..
పరంధామయ్య అన్న మాటలు తలచుకుని నందు ఆలోచిస్తూ ఉంటాడు.. అప్పుడే లాస్య వచ్చి రిలాక్స్ నందు .. ఇవన్నీ ఒకటి రెండు రోజులు మాత్రమే.. ఓకే బాధ నెత్తిన పెట్టుకొని ఎక్కువ రోజులు మోయాలేరు.. నీకు వినడం ఇష్టం లేకపోయినా ఒక మాట చెబుతాను . నందు సామ్రాక్ తులసి ఇద్దరు ఒక రాత్రి బయట గడిపిన తర్వాతే.. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకున్నారు.. ఇప్పటినుంచి వాళ్లకి మనసులో ఆ ఆలోచన ఉండి ఉంటుంది అవకాశం దొరికి ఎగిరిపోయారు అని లాస్య అంటుంది.. తెలివిగా తప్పు మన మీద నెట్టేశారు.. వీటన్నింటి నుంచి నేను ఆలోచించేది ఒక్కటే నా కుటుంబం నుంచి సామ్రాట్ దూరమయ్యాడు..
నేను మళ్ళీ నా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను.. ఇప్పుడు దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడు చేతిలో ఉద్యోగాలు ఉండి రమ్మన్నప్పుడు వీళ్ళు రాలేదు.. కానీ ఇప్పుడు మన బ్రతుకులే మనకు కష్టంగా ఉన్నప్పుడు ఇదొక అదనపు బాధ్యత అయింది.. ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే జాబ్స్ చేయాలి.. తులసి లేని లోటును భర్తీ చేయాలి.. ఇప్పుడు ఇది నీ ఫ్యామిలీ అని నందు అంటాడు.. నందు కోపంగా బయటికి వచ్చి ఇక నుంచి ఈ ఇంట్లో తులసి పేరు వినపడటమే కాదు కనపడకూడదు అని నందు తులసి నేమ్ బోర్డ్ బయట పడేస్తాడు.. తులసి వాళ్ళ అమ్మ సామ్రాట్ ను పోగుడుతుంది.. రేస్ ఎక్కడ మొదలవుతుందో తెలియటం లేదు మళ్లీ మొదటికి వచ్చేసాను అని తులసి అంటుంది మీరు ఆల్రెడీ రేస్ మొదలు పెట్టేశారు అని సామ్రాట్ అంటారు.. అయితే గన్ షూట్ చేయాలి తులసి అంటుంది..
ఆల్రెడీ మీరు గన్ షూట్ చేసేసారు.. ఇక పరుగు మొదలు పెట్టడమేనా అని అంటారా అని తులసి అంటుంది.. ఎగ్జాక్ట్లీ అని సామ్రాట్ అంటాడు.. నా ప్రేమ్ ఎప్పుడు నాతోనే ఉంటాడు.. అయినా ఈ కొడుకు ఈ అమ్మను వదిలి పెట్టడు.. తులసి మనసు మారే లోపు ఈ ఇంటిని తులసి నుంచి లాగేసుకోవలి అని లాస్య అనసూయమ్మ కు సలహా ఇస్తుంది..