Intinti Gruhalakshmi: నందు వాళ్ళ అమ్మానాన్నల దగ్గరకు వెళ్లి రేపు అమెరికా నుంచి నా ఫ్రెండ్ వివేక్ వస్తున్నాడని.. తను వచ్చినప్పుడు తులసి నా భార్యగా నటించాలని చెబుతాడు. అసలు నువ్వు మనిషివేనా నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటూ.. వాళ్ళు నందుకి కావలసిన అంత గడ్డి పెట్టి అక్కడ నుంచి పంపించేస్తారు. మీ ప్లాన్ వర్కౌట్ అయిందా అని లాస్య నందుని అడుగుతుంది. లేదు అని నందు అనడంతో.. ఇక నేనే రంగంలోకి దిగుతాను అని లాస్య అంటుంది.

తులసి కూరగాయలు కోస్తుండగా.. లాస్య అక్కడికి వెళ్లి నువ్వు లేకపోతే నందు కేఫ్ లేదు నందు ఈరోజు పొజిషన్లో ఉండటానికి కారణం నువ్వే.. అంటూ తులసిని ఆకాశానికి ఎత్తేస్తుంది. లాస్య మాటలు అర్థం చేసుకున్న తులసి నువ్వు ఏదో అడగాలని నా దగ్గరకు వచ్చావు అదేంటో నిర్మొహమాటంగా అడుగు అని తులసి అంటుంది . రేపు నందు ఫ్రెండ్ వివేక్ యుఎస్ నుంచి వస్తున్నాడు ఆ విషయం నీకు తెలుసా అని లాస్య అంటుంది. చెప్పాడు నందు అని తులసి అంటుంది. తను వచ్చినప్పుడు నువ్వు నందు భార్యగా యాక్ట్ చేయాలి . ఆయనకు మీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారని నందు నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలియదు అని లాస్య అంటుంది. నేను అలాంటి పనులు ఎప్పటికీ చేయను అని లాస్య అడిగిన దానికి నో అని డైరెక్ట్ గా చెప్పేస్తుంది తులసి. తులసి ఒప్పుకోలేదని నందితో చెబుతుంది.

దివ్య ఒక కేసు విషయం గురించి మాట్లాడడం కోసం తన డీన్ దగ్గరకు వెళుతుంది తను ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉండగా.. ఒక కర్టెన్ వెనకమాల నుంచి ఏవో మాటలు వినిపిస్తాయి అవి డీన్ మాటలే అని అర్థం చేసుకున్న.. దివ్య ఆ కర్టెన్ ఓపెన్ చేసి చూస్తుంది. సరసాలు ఆడుతూ ఆ డీన్ ఓ నర్సు తో సరసాలు ఆడుతూ కనిపిస్తాడు. దాంతో దివ్య గడ్డి పెట్టబోతుండగా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నువ్వు అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని అతను అడగగానే.. ఈ కేస్ గురించి మాట్లాడాలని వచ్చాను అని దివ్య అంటుంది. ఈ కేసు విషయం నేను చూసుకుంటాను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోతాడు..

విక్రమ్ ని ఏ అమ్మాయితో అయితే చూసి దివ్య తప్పుగా అనుకుంటుందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని హాస్పటల్లో జాయిన్ చేస్తారు. తనకి ట్రీట్మెంట్ చేసి దివ్య నయం చేస్తుంది .
విక్రమ్ వల్లే కదా నీకు ఈ బాధ అని దివ్య అంటుంది . విక్రమ్ కలలో కూడా ఒకరికి హాని చేయడం చాలా మంచివాడు అని ఆమె చెబుతుంది. అనవసరంగా ఒక మంచి మనిషిని తప్పు పట్టాను అని దివ్య ఫీలయ్యి విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. ఆ లోపు విక్రమ్ కి పెళ్లిచూపులు జరగడం ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడుతూ ఉండటం. ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని విక్రమ్ చెప్పటం చక చక జరిగిపోతాయి. ఇక ఏం జరుగుతుందో త్వరగా చూద్దాం.