Intinti Gruhalakshmi: పరంధామయ్య దగ్గరికి వచ్చిన నందు తులసి విషయంలో నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతాడు. నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని వాళ్లంతా అంటారు. మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నప్పుడు నా నిర్ణయాలు కూడా నేను తీసుకుంటాను. ఇప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని కన్విన్స్ చేసి నేను డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు నా నిర్ణయం నేనే తీసుకుంటున్నాను అని ఈ ఇల్లు ని నా బిజినెస్ కోసం తాకట్టు పెడుతున్నానని నందు చెబుతాడు.. ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే అని నందు అంటాడు.. దాంతో అందరూ షాక్ అవుతారు ఇక నందు లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇక అదే విషయాన్ని శృతి తులసికి చెబుతుంది. అంతా ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. నేను అనుకున్నదే నందు చేసేసాడు అని తులసి అనుకుంటుంది. కానీ దీన్ని ఎలా ముందు వెళ్లకుండా ఆపాలో నేను ఆలోచిస్తాను. శృతి నువ్వు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచించకు అని తులసి భరోసా ఇస్తుంది. ప్రేమ్ తనుకు వచ్చిన జీతం డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే లాస్య అక్కడికి వచ్చి ఈ ఇంటి బాధ్యతలను పంచుకుంటానని మాట ఇచ్చావు. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండగా ఇంటికి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం లేదు అని లాస్య అడుగుతుంది. సరే అని ప్రేమ్ డబ్బులు లెక్కపెట్టి ఇస్తుండగా.. ప్రేమ్ చేతిలో ఉన్న మొత్తం డబ్బులను లాస్య లాక్కుంటుంది అదేంటి మొత్తం తీసుకున్నావు అని అడిగితే నీకు అవసరమైనప్పుడు చెప్పు నేనే ఇస్తాను అని లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో శృతిని రేపు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలి అని మాట ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తుండగా.. ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మాయి ఇచ్చిన గిటార్ కనిపిస్తుంది.
ఇక ఆ గిటార్ ని తీసుకొని తాకట్టు పెట్టడానికి వెళ్తాడు. తాకట్టులో ప్రేమ్ దీనంగా ఈ గిటార్ గురించి వాళ్ళ అమ్మ గురించి చెబుతాడు. అవసరానికి డబ్బులు ఇవ్వమని ఆ తర్వాత కచ్చితంగా తీసుకెళ్తానని ప్రేమ్ అంటాడు . ఆ మాటల్లో తులసి చాటుగా ఉంటుంది. ఎందుకు ప్రేమ్ గిటార్నీ తాకట్టు పెట్టావు సాలరీ వచ్చింది కదా అని తన ఫ్రెండ్స్ అడుగుతారు . మా ఇంట్లో ఓ రాక్షసి ఉంది కదా తన వల్లనే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని ప్రేమ్ అంటాడు. నా చేతిలో ఉన్న డబ్బులన్నీ తనే లాగేసుకుంది మా అమ్మ కోసం ఇదంతా భరిస్తున్నానని ప్రేమ్ చెబుతాడు మరి ఈ విషయాన్ని మీ అమ్మతో చెప్పొచ్చు కదా అంటే ఈ విషయాలన్నీ అమ్మకు తెలిస్తే తను బాధపడుతుంది. అందుకే చెప్పడం లేదు అని ప్రేమ్ తన ఫ్రెండ్స్ తో ఉంటారు. చాటుగా ఈ మాటలను వింటున్న తులసి వ్యక్తి ఏడుస్తుంది .
ఇక రేపటి ఎపిసోడ్ లో అనసూయమ్మ పరంధామయ్యలకు భోజనం వడ్డిస్తానని లాస్య ఎంతసేపటికి రాదు ఆకలితో అలమటిస్తున్న పరంధామయ్య అనసూయమ్మ సిగ్గు విడిచి ఓ ఫంక్షన్ లోకి వెళ్లి అన్నం వడ్డించుకుని తింటారు. అంతలో సెక్యూరిటీ గాడు వచ్చి వాళ్ళని నీచంగా మాట్లాడుతారు . ఏంటి నాన్న ఇది ఇలా చేస్తున్నారు అని తులసి అక్కడికి వచ్చి పరంధామయ్యలో అడుగుతుంది . ఇక ఆ ఫంక్షన్ లో తులసిని అందరూ నిలదీస్తారు బాధ్యత తీసుకోవడం అంటే ఇదేనా వాళ్ళ బాగోగులు చూస్తే పనిలేదని తులసిని నిందిస్తారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!