Intinti Gruhalakshmi: నందు ఫ్రెండ్ వివేక్ యుఎస్ నుంచి వస్తాడు. రావడంతోనే నందు ఎదురు వెళ్లి స్వాగతం పలుకుతాడు. నువ్వు వచ్చావ్ ఏంట్రా .. మా చెల్లెమ్మ ఏం చేస్తుంది తులసి ఇంకా రాలేదేంటి అని వివేక్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. నందు ఏదైతే అది అయింది అని నీతో ఓ విషయం చెప్పాలిరా అని నందు వివేక్ కి చెప్పబోతుండగా . తులసి హారతి పళ్లెం తీసుకొని ఎదురుగా వస్తుంది .ఇక నందు తన భర్త అని అనుకునే లాగా ఓ నాలుగు మాటలు కూడా మాట్లాడుతుంది..

విక్రమ్ కి పెళ్లిచూపులు జరగడం ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడుతూ ఉండటం. ఇక ఆ అమ్మాయిని విక్రమ్ నీతో పర్సనల్గా మాట్లాడుతాను అని అంటుంది. ఏం మాట్లాడాలి అని విక్రమ్ అడుగగా నేను మీకు నచ్చానా అని అడుగుతుంది. మా అమ్మకు నచ్చితే నచ్చినట్టే అని చెబుతాడు. కానీ నాకు చదువుకున్న అబ్బాయే భర్తగా రావాలని కోరుకున్నాను. ఆ విషయమే నేను మా వాళ్లతో చెప్పలేను. మీరు నేను నచ్చలేదని ఈ సంబంధం క్యాన్సిల్ చేయమని తను అడుగుతుంది. ఆ విషయం మీరే మీ ఇంట్లో వాళ్లతో చెప్పొచ్చు కదా అని విక్రమ్ అంటాడు.

విక్రమ్ ని ఏ అమ్మాయితో అయితే చూసి దివ్య తప్పుగా అనుకుంటుందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని హాస్పటల్లో జాయిన్ చేస్తారు. తనకి ట్రీట్మెంట్ చేసి దివ్య నయం చేస్తుంది . విక్రమ్ వల్లే కదా నీకు ఈ బాధ అని దివ్య అంటుంది . విక్రమ్ కలలో కూడా ఒకరికి హాని చేయడం చాలా మంచివాడు అని ఆమె చెబుతుంది. అనవసరంగా ఒక మంచి మనిషిని తప్పు పట్టాను అని దివ్య ఫీలయ్యి విక్రమ్ కి ఫోన్ చేస్తుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య వివేక్ దగ్గరకు వచ్చి బాగున్నావా అంటూ కుశల ప్రశ్నలు వేస్తుంది. అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని వివేక్ రివర్స్ కేర్ లో ప్రశ్నిస్తాడు. ఇక తులసి దగ్గరకు వెళ్ళిన లాస్యకి చేదు అనుభవం ఎదురవుతుంది. నువ్వు అనుకున్నవన్నీ ఇక్కడ జరగవు అని తులసి మొహం మీద చెప్పేస్తుంది.