Intinti Gruhalakshmi: తులసి బాధపడుతుందని తెలుసుకున్న పరంధామయ్య తనకి ఏదో ఒక విధంగా సాయం చేయాలని.. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని తీసుకుని సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సామ్రాట్ బాబు తులసి తో మీ స్నేహం ఇలాగే పదికాలాలపాటు ఉండాలి అని అనుకుంటున్నాను. నీ మీద నాకు ఉన్న నమ్మకంతో నేను మిమ్మల్ని ఒక కోరిక కోరాలని వచ్చాను అని పరంధామయ్య అంటాడు.. మీరు కాదు అనరన్న నమ్మకం ఉంది.. తప్పకుండా చేస్తానని సామ్రాట్ అంటాడు.. పరంధామయ్య ఒక సైట్ డాక్యుమెంట్స్ చూపిస్తూ వాటి గురించి సామ్రాట్ కి సీక్రెట్ గా చెబుతాడు.. సైట్ డాక్యుమెంట్స్ చూపించి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా బాబు.. నేను అడిగింది చేసి పెడతావు కదా అని పరంధామయ్య సామ్రాట్ ని అడుగుతాడు. తప్పకుండా మా వాడు చేస్తాడు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మాట ఇస్తాడు.. మరోపక్క తులసి సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్తున్నానని అనసూయమ్మతో చెబుతుంది. వద్దు అని అనసూయమ్మ అంటుంది.. నేను వెళ్తాను.. నా జీవితం నాది.. నా లైఫ్ నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను…ఒకరికి నచ్చినట్టు నేను ఉండను.. నువ్వు ఇది వరకు ఇట్లాగా కాదు తులసి చాలా మారిపోయావు. ఒకప్పుడు అందరు గురించి ఆలోచించే దానివి.. కానీ ఇప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేంత స్వార్థం నీలో వచ్చేసింది.. ఇంత పెద్ద గొడవ జరిగినా నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలి అనుకోవడం నాకు నచ్చడం లేదు అని అనసూయమ్మ అంది..
తులసి అనసూయమ్మ మాటను పెడ చెవిన పెట్టీ ఆఫీస్ కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ కూడా తులసి కి లాస్య చేతిలో అవమానం జరుగుతుంది.. మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడా తులసి అడగగా.. లాస్య ను వాటన్నింటినీ టకే ఓవర్ చేసుకుంది అని చెబుతారు..
అర్ధరాత్రి శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోవలని ఆ ఇంటి తలుపులు తీస్తుంది.. అది కాస్త తులసి చూస్తుంది.. శృతిని అడిగి తులసి అసలు ఏం జరిగిందో చేసుకుంటుంది.. అసలు అర్ధరాత్రి నీ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు ఎలా ఉన్నావు అని అడుగుతుంది.. అసలు విషయం తెలిసి ప్రేమ్ చెంప పగలగొడుతుంది తులసి.. నువ్వు కూడా మీ నాన్న లాగా తయారవుతున్నావు.. ఎంతైనా నువ్వు ఆ నందగోపాల్ కొడుకువి.. ఛీ అని ప్రేమ్ ను చీదరించుకుంటుంది.. ప్రేమ్ రియాక్షన్ ఏంటో తరువాయి భాగంలో తెలుసుకుందాం..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!