Intinti Gruhalakshmi: డీజే టిల్లు పాటకి సామ్రాట్ లక్కీ కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తారు.. ఆ సాయంత్రం ను ఇంకాస్త జాయ్ ఫుల్ చేస్తారు.. నెక్స్ట్ దివ్య వచ్చి అంకుల్ ఒక స్లిప్ తీయమని చెబుతుంది..ఆ స్లిప్ లో ఓ చక్కని కథ చెప్పమని ఉంటుంది.. ఇప్పుడు నేను చెప్పబోయేది కథ కాదు నిజమైన కధ.. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఓ బాస్ కథ.. బాస్ అంటే కేవలం బాస్ ఇజం చేసేవాడే కాదు.. తనతో ఉండే వాళ్ళ కష్టసుఖాల్ని కూడా మంచి చెడ్డల్ని తెలుసుకుని సపోర్టుగా నిలబడాలి.. తను చూసిందే తనకు తెలిసిందే నిజం అని అనుకోకూడదు.. సమస్యల్ని ఎదుటి వారు మనిషి నుంచి కూడా చూడాలి.. అలా చేయనప్పుడు బాస్ అనిపించుకోవడానికి అర్హత కోల్పోయినట్టే.. నా కథ లో బాస్ లో అలాంటి వాడే ఐ హేట్ హిమ్.. అలాంటివాడు నా కంటి ముందు కనపడితే చంప పగలగొడతాను.. ఆ బాస్ గాడికి ఒళ్లంతా ఇగో.. లేకపోతే ఏంటండీ అపార్థమే చేసుకోవడమే కాకుండా ఇంటి మీదకు వెళ్లి రచ్చ చేస్తాడా.. అని తన కథ నే కథగా చెబుతాడు..
Intinti Gruhalakshmi: సామ్రాట్ పై అభి ఫైర్.. నందు, లాస్య మనోగతం చెప్పిన సామ్రాట్..!
పరువు ఆత్మ అభిమానం తనకే ఉంటే అనుకుంటున్నాడా ఎదుటి వాళ్ళకి ఉండవా.. కచ్చితంగా ఆయన చెప్పేది మన కదలని లాస్య నందుని చూస్తూ అంది.. తన మాజీ భర్త తన భార్య దగ్గరకు వెళ్లి తనే మాజీ భర్త అనే విషయాన్ని ఆఫీసులో తెలియకూడదు అని బ్రతిమిలాడుకున్నాడు.. ఆ మాజీ భర్త మాటకు ఆమె కట్టుబడి ఉంది.. నిందను భరించింది.. బాస్ ఆగడాలను భరించింది. కానీ మాజీ భర్తను మాత్రం ఎక్స్పోజ్ చేయలేదు.. నూటికో కోటికో ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారు.. చేసిన తప్పుకు ఆమె మాజీ భర్త కాళ్లు పట్టుకొని ఉంచమని అడిగినా కూడా తక్కువే అని సామ్రాట్ నందు ను చూస్తూ అంటాడు.. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఆ బిజినెస్ మాన్ తరపున ఆ మహా ఇల్లాలికి నేను నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని సామ్రాట్ అంటాడు.. వెంటనే లాస్య, నందు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతరు..
తులసి గారు మీ బాస్ చేసిన తప్పులు క్షమిస్తూ రేపు మీరు ఆఫీస్ కి రండి అని సామ్రాట్ అంటాడు.. నేను ఎదురు చూస్తూ ఉంటాను.. బై అని సామ్రాట్ హానిని తీసుకుని వెళ్లి పోతడు..తులసి ఆ వినాయకుడి దగ్గరకు వెళ్లి రెండు చేతులతో నమస్కరించి ఆ పరమేశ్వరుడు కూడా తన మీద పడ్డ నిందలను పోగొట్టుకోవడానికి 28 రోజులు యుద్ధం చేయవలసింది .. కానీ నిన్నే నమ్ముకున్న నాకు నా మీద పడ్డ అపనింద నుండి ఇంత త్వరగా బయట పడేస్తావని అనుకోలేదు.. నమ్మిన మనిషిని బాధ పెట్టని కృతజ్ఞురాలిగా ఉన్నన్నే అని అనుకున్నా నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది తులసి ఆనందంగా వినాయకుడుకి దండం పెడుతుంది..
రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ తులసిని తీసుకుని నందుల వైపు చూస్తూ మీ తులసి వనంలోకి వచ్చాము అంటూ ప్రాజెక్టు సైట్ దగ్గరికి వస్తారు జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు అలాంటి మీరు ఈ చిన్న గుంటను దాటలేరా అని తులసిని అంటాడు తన చేయని అందించి ఆ గుంట దాటేలాగా చేస్తాడు సామ్రాట్.. లాస్య, నందు షాక్ అవుతూ తులసి వాళ్ళ వైపు చూస్తారు..