Intinti Gruhalakshmi: విక్రమ్ ని కలిసిన తర్వాత దివ్య ఇంటికి రావడంతోనే ఇంట్లో నవ్వులు వినిపిస్తాయి. అదేంటి రోజు ఈ టయానికి అందరూ నిద్రపోతూ ఉంటారు కదా.. ఈ రోజేంటి మాటలు వినిపిస్తున్నాయి అని ఇంట్లోకి వెళ్లేసరికి.. వాళ్ల అమ్మ తులసి నందు కి భార్యగా మాట్లాడటం.. నందు కూడా తులసి భార్య అన్నట్టుగా వాళ్ళందరూ ముందు మాట్లాడడం గమనించి దివ్య ఆలోచనలో పడుతుంది. దివ్య ఎక్కడ నోరు తెరిచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు అని అంటుందోనని కంగారు పడుతూ ఉంటుంది.

అమ్మ దివ్య ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు .. రా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని లాస్య అక్కడి నుంచి దివ్యను లాక్కల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది . అప్పుడే వాసు లాస్యను అడ్డుకుంటాడు. ప్రతి విషయంలో నీ జోక్యం ఏంటి నువ్వు సైలెంట్ గా ఉండు అని అంటాడు. లాస్య ఆ మాటలను పట్టించుకోకుండా దివ్య ను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతుంది. కాసేపటి తరువాత దివ్య పాటలు పాడుకుంటున్న తులసి దగ్గరకు వచ్చి కోపంగా నిలబడుతుంది. ఏమైంది ఎందుకు అదోలాగా ఉన్నావు అని అడిగితే నువ్వు చేసే పని నాకు ఏమీ నచ్చడం లేదు.
నువ్వు నాన్నకు భార్యగా నటించడం ఏంటి ఇదంతా లాస్య కోసమేనా అని దివ్య అడుగుతుంది. ఒకరి కోసం నేను ఎప్పుడూ నటించను మీ నాన్న సంతోషం కోసం మాత్రమే నేను ఇదంతా చేస్తున్నాను అని తులసి అంటుంది. నా మీద ఏమైనా నీకు తప్పు భావన కలిగిందా అని తులసి అడగగానే .. నీ మీద నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కలదు అని దివ్య అంటుంది. నువ్వు ఎప్పుడు నాన్నతో కలిసి ఇలాగే సంతోషంగా ఉండాలని నా ఆశ కోరిక ఇవి నా పిచ్చి కోరిక అనుకున్న నాకు పర్వాలేదు. ఇదే జరగాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని దివ్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
దివ్య గురించి విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దివ్య కూడా తన గురించి ఆలోచిస్తుందో లేదో తెలుసుకోవాలంటే మెసేజ్ పెట్టండి అబ్బాయిగారు అంటూ విక్రమ్ కి సలహా ఇస్తాడు. దాంతో విక్రమ్ దివ్యకి మెసేజ్ పెట్టగానే వెంటనే ఎలా ఉన్నారు భోంచేసారా అంటూ దివ్య కూడా రిప్లై ఇస్తుంది. అలా ఇద్దరూ చాటింగ్ లో పడిపోతారు. దివ్య మాటలకి హుషారు వచ్చిన విక్రం ఇల్లంతా చక్కర్లు కొడుతూ ఉంటాడు. విక్రమ్ ఎలాగైనా దారిలో పెట్టాలని వాళ్ళమ్మ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.