NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో ఆ పూజకు బయలుదేరిన పరంధామయ్య, మాధవి.. అడ్డుపడిన అనసూయమ్మ.!

Intinti Gruhalakshmi today episode Highlights

Intinti Gruhalakshmi: నందు ఉదయం నిద్రలేవగానే నేను ముంబై వెళ్తున్నాను అంటూ ట్రావెల్ బ్యాగ్ తీసుకుని వస్తాడు. వాళ్ల అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంట్లో ఎవ్వరూ నాన్నను ఇబ్బంది పెట్టకండి. నాన్నను బాధ పెట్టకండి. ఇప్పటికే ఆయన చాలా బాధ పడుతున్నారు. మీరు ఈ ఇంట్లో ఆయన్ని బాధ పడేలా, తులసి ప్రస్తావన కూడా తీసుకు రావద్దని లాస్య, అనసూయమ్మ కి కాస్త గట్టిగా చెబుతాడు. అభి ఆ బాధ్యత ను తీసుకుంటాడు.. మీరు వచ్చేవారు తాతయ్య ను ఎవ్వరూ ఏమి అనకుండా చూసుకుంటాను అన్నాడు..

Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights
Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights

సామ్రాట్ తులసి దగ్గరకు బయలు దేరాడు.. అలా దారిలో వెళ్తుండగా తులసి కనిపిస్తుంది. నాకు ఒకటి అర్థం అయ్యింది. నేను కూడా అలోచించనంత బాగా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి మాత్రం నిజం తులసి గారు.. నా మనసులో ఉన్నవన్నీ అక్కడ చెప్పేశాను.. తప్పు చేశానా అని సామ్రాట్ అంటాడు.. అవును గీత దాటరు. ఒక మంచి స్నేహితుడు గా బాగా మాట్లాడారు. నా మీద కోపం కదూ అని సామ్రాట్ అంటాడు.. కాదు అది గొప్ప అనుభూతి.. కానీ ఏ బంధం లేని మీరు నాలో పరకాయ ప్రవేశం చేసి నా మనసులో ఉన్న మాటలు వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పారు. నిజమే నిన్నటి గొడవ వల్ల నాకు మీరు దూరం అవుతారని భయపడ్డాను. ముందు నేను అదే అనుకున్నాను.. కానీ ఎప్పటికీ వదులుకో కూడదని అర్థం చేసుకున్నాను అని తులసి అంటుంది. అంటే మనం ఫ్రెండ్స్ ఆ అని అంటాడు. హ.. ఫ్రెండ్స్ అని తులసి షేక్ హ్యాండ్ ఇస్తుంది..

Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights
Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights

పరంధామయ్య ఇంటికి వస్తాడు.. అనసూయమ్మ తులసి కోటకు పూజ చేస్తుంది. ఇక్కడ నేను కూడా ఉన్నాను నా వైపు కూడా చూస్తే బాగుంటుంది చూడాలి అని అనుకోలేదు.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెబుతుంది అనసూయమ్మ. మీరు ఇలా గుడిలోకి వెళ్లి పడుకోవడం ఏమీ బాగోలేదు అని అనసూయమ్మ అంటుంది. ఈ ఇంటికి గృహలక్ష్మి ఎలాగూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. కనీసం ఆ గుడిలో ఉన్న మహాలక్ష్మి అయినా నా బాధ అర్థం చేసుకుంటుందని గుడిలో నిద్రపోతున్నాను అని పరంధామయ్య ఇంట్లో అన్నాడు.. తను ఇంట్లోకి రాగానే అందరూ ముభావంగా కనిపిస్తారు. ప్రేమ్ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? రాత్రి నేను లేనప్పుడు తులసి గురించి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని ప్రేమ్ ను అడుగుతాడు పరంధామయ్య.. తాతయ్య అది అని చెప్పేలోపే అభి ప్రేమ్ ను చెప్పొద్దు అని వారిస్తాడు. అలాంటిది ఏమీ లేదు అని ప్రేమ్ చెబుతాడు . కచ్చితంగా ఏదో జరిగింది అని పరంధామయ్య మనసులో అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights
Intinti Gruhalakshmi Serial 16 November 2022 today 791 episode Highlights

తులసి వాళ్ళ ఇంట్లో సామ్రాట్ ఆకలేస్తుంది. తులసి గారు త్వరగా రండి అని అంటాడు. మీరు రాకపోతే చెప్పండి నేనే వంట గదిలోకి వచ్చేస్తాను అని లెగుస్తుండగా తులసి బ్రేక్ ఫాస్ట్ తీసుకొని వస్తుంది. మీ ఇంట్లో ఏదైనా అమృతాన్ని కలిపారా మీ వంట ఎంత అద్భుతంగా ఉంది అని సామ్రాట్ తులసిని పొగుడుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి పూజకు ఏవో ఏర్పాట్లు చేస్తుంది. ఏంటి తులసి గారు ఇవన్నీ అని సామ్రాట్ అడిగితే శతమానం పూజకు కావాల్సిన ఏర్పాట్లు అని చేస్తున్నాను తులసి చెబుతుంది. మా మామయ్య వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్న పూజ ఇది అని తులసి చెబుతుంది. ఇక పరంధామయ్య దగ్గరికి వెళ్లిన మాధవి వెళ్దామా నాన్న అని అడుగుతుంది. ఎక్కడికి అని అనసూయమ్మ అంటుంది. తులసి వాళ్ళ ఇంటికి అని పరంధామయ్య చెబుతాడు. ఆ ఇంటికి వెళ్లడానికి నేను ఒప్పుకోను అని అనసూయమ్మ అంటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu