Intinti Gruhalakshmi: తులసి గారు మనం మీకు ఇష్టమైన తులసి వనంలోకి వచ్చాము అని సామ్రాట్ అంటాడు.. పక్కనే ఉన్న నందు లాస్య ఇద్దరు జలసి తో ఫీల్ అవుతారు.. మీరు ఇందాక ఏదో సజెషన్ చెబుతున్నారు అని తులసిని అంటాడు.. అవునండీ.. స్కూల్ వెంటిలైజేషన్ ప్రాబ్లెమ్ గురించి అని తులసి అంటుంది.. అదేంటి తులసి అలా అయితే చాలా ఇన్వెస్ట్ చేయాలి పైగా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అని నందు లాస్య అంటారు.. ఎలా అయినా పర్వాలేదు వెంటనే చేంజ్ చేయండి అని సామ్రాట్ అంటాడు..
ఇలా అయితే మీకు చాలా లాస్ వస్తుంది సార్ అని లాస్య అంటుంది. వెంటనే తులసి లాస్య నువ్వు ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యావు అని తులసి అడుగుతుంది. నేను అందంగా కనిపించడానికి అని లాస్య చెబుతుంది. కొద్ది క్షణాలు ఆనందంగా కనిపించడానికి నువ్వు ఇంత అందంగా రెడీ అయినప్పుడు మన స్కూల్ కి వచ్చే పిల్లల ఆరోగ్యం గురించి కూడా మనం ఇంకా ఎక్కువగా ఆలోచించాలి కదా అని
మార్నింగ్ నుంచి చూస్తున్న ఇంతవరకు కాఫీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు నీకు ఒక జలక్ ఇస్తానని ప్రేమ్ అనుకుంటాడు.. వాళ్ల నాన్న మ్మ తాతయ్యలు పక్కన కూర్చుని శృతి కాఫీ ఇవ్వు అని ప్రేమ అంటాడు.. శృతి కాఫీ అని ప్రేమ్ అంటాడు.. అదేంటే మొగుడు కాఫీ అని అడుగుతుంటే పట్టించుకోకుండా అలా దులిపేసుకుని వెళ్ళిపోతున్నావని అనసూయమ్మ అంటుంది.. సారీ ప్రేమ్.. నిజంగా అడిగావా.. వినిపించుకోలేదు.. క్షణాల్లో తెస్తాను అని శృతి వ్యంగ్యంగా అని లోపలికి వెళ్లి కాఫీ తీసుకు వస్తుంది.. ప్రేమ్ కాఫీ తీసుకుని కాఫీ తాగకుండా ఉప్పు కలపలేదుగా అని అడుగుతాడు.. ఛీ యాక్ చేదు అని ప్రేమ్ అంటాడు..
సామ్రాట్ నేను ఒక దురదృష్టవంతుడు గురించి ఆలోచిస్తున్నాను.. ఎవరు సార్ అతను అని నందు అడుగుతాడు.. ఇంకెవరూ నువ్వే అని సమ్రాట్ అంటాడు.. సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను ఇంకెవరు తులసి గురించి అని సామ్రాట్ అంటాడు.. అసలు ఆ వరాన్ని ఎందుకు వదులుకున్నావు.. ఆఫ్ కోర్స్ ఇది నీ పర్సనల్ విషయం బాస్ గా అడిగే హక్కు నాకు లేదు అని సామ్రాట్ అంటాడు.. దయచేసి మర్చిపోతున్న పీడకల గురించి ఇప్పుడు గుర్తు చేయకండి అని నందు అంటాడు.. అదేంటి ఒక్కరోజు నేను మీ కుటుంబంతో కలిసి గడిపితే నాకు స్వర్గపు అంచులు గాక వెళ్లి వచ్చినట్టు ఉంది అని సామ్రాట్ అంటాడు.. చంద్రుని దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తాడు.. కానీ దగ్గరికి వెళ్తేనే అతని మచ్చలు కనిపిస్తాయి అని నందు అంటాడు..