Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో చక్కగా పూజ చేస్తూ ఉంటారు. ఇక శివరాత్రి ప్రత్యేకత గురించి తులసి చక్కగా ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తుంది. పూజ జరిగేంతవరకు ఓం నమశ్శివాయ అని అనుకుంటూ ఉండమని చెబుతుంది .. నందుకి కేసు నుంచి ఫోన్ వస్తుంది. సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చారు. అర్జెంటుగా రండి అని కాల్ చేస్తారు..

నందు ఉన్న విషయాన్ని తులసికి చెబుతాడు. పూజలో ఉన్న తులసి నేను కూడా వీళ్లతో పాటు వెళ్తాను. పూజ మధ్యలో ఆగకూడదు మీరు పూజ చేస్తూ ఉండండి అని తులసి నందు తో పాటు లేచి వెళ్తుంది.. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ కేఫ్ లో నానా యాగి చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదేంటి అని ఇక నందు వాళ్లు వెళ్లేసరికి.. మీ కేక్ మీద కంప్లైంట్ వచ్చింది.

మాది ఇటీవల స్టార్ట్ చేసిన బిజినెస్ అని మా కేస్ మీద ఇంతవరకు మాకే కంప్లైంట్స్ రాలేదని అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారో చెప్పమని నందు అడుగుతాడు .. నీకు డీటెయిల్స్ అన్ని చెప్పాలా.. రేపు రిపోర్ట్స్ వచ్చాక మీకేం ఉండాలో మూతపడాలో మీకే అర్థమవుతుంది అని ఆ శాంపుల్స్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

ఇక ఇంటికి వచ్చేసరికి తులసి వాళ్ల కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఏమైంది అని అడగగా జరిగిన విషయాన్ని మొత్తం చెబుతారు.. హోటల్ హైజీనిక్ గా ఉంచాలని ఆయన అన్నారు ఇంట్లో కిచెన్ లోకి రాని నువ్వు తులసి ఆంటీ గురించి తప్పుగా మాట్లాడకు అని ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు. ఇంట్లో శుభ్రంగా ఉండటం వేరు కేఫ్ లో శుభ్రంగా ఉండటం వేరు.. అసలు నందుకి ఈ ఐడియా ఇచ్చింది తులసినే.. ఇదంతా జరగడానికి తులసినే కారణం.. రేపు జరగరానిది ఏమైనా జరిగితే టైము, డబ్బులు, సమయం అంతా వృధా అని లాస్య అంటుంది.

లాస్య అన్న మాటలకు నందు తులసికి క్షమాపణలు చెబుతాడు. తను అలాగే మాట్లాడుతుంది. నువ్వు ఏమీ కంగారు పడకు అని నందు అంటాడు.. నాకు కావాల్సింది క్షమాపణలు కాదు. కేఫ్ మూతపడకుండా ఉంటే అదే చాలు అని.. ఇక తులసి ఆ రాత్రంతా మేలుకొని పూజ చేస్తుంది.. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి ఎయిర్ పోర్టు కి వెళ్తుంది..

ఆ ఎయిర్పోర్ట్ లో మరో కొత్త క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. ఆ అమ్మాయి ఎవరు.. తులసికి ఏమవుతుంది.. లేదంటే పూజ ప్లేస్ లో ఈ కొత్త అమ్మాయిని రీప్లేస్ చేస్తున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి.. అమ్మాయి పాత్రతో సీరియల్ ఎలా మలుపు తిప్పుతారు అనేది చూడాలి..