Intinti Gruhalakshmi: తులసి ఆఫీస్ లో వర్క్స్ చూసుకుంటూ ఉంటుంది. సామ్రాట్ గారు ఏంటి ఎక్కడి వర్క్స్ అక్కడ వదిలేసి వెళ్లిపోయారు అని తులసి మనసులో అనుకుంటుండగా.. సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. క్లైంట్స్ తో మీటింగ్ ఉందని ఆ మీటింగ్ కి మీరే అటెండ్ అవ్వాలని సామ్రాట్ తులసితో అంటాడు.

సామ్రాట్ జూ మీటింగ్లో తులసిని క్లైంట్స్ ముందు కూర్చోబెట్టి పరిచయం చేస్తాడు .ఈరోజు నా బదులుగా మీతో తులసి మాట్లాడుతుందని చెబుతాడు క్లైంట్స్ వేసే ప్రశ్నలకు తులసి నవ్వుతూ ఉంటుంది. కానీ ఎలాంటి సమాధానం చెప్పదు. అప్పుడే తులసి ఆ క్లైంట్స్ తో తెలుగులో మాట్లాడుకుందాం. మన భాష గొప్పదనాన్ని మనమే తెలుసుకోవాలి అంటూ.. ఆ ప్రాజెక్టు గురించి తెలుగులో స్పీచ్ దంచేస్తుంది. ఇక క్లైన్స్ తులసి మాటలకు కన్విన్స్ అయ్యి ఆ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకుంటారు. సామ్రాట్ తులసికి కంగ్రాట్యులేషన్స్ చెబుతాడు. ఆ ప్రాజెక్టు బాధ్యతలని మీరే చూసుకోవాలని తులసికి సామ్రాట్ చెప్తాడు. ఇక అదే విషయాన్ని తులసి వాళ్లందరికీ చెప్పాలని అనుకుంటుంది.

దివ్య లాప్ టాప్ గురించి ఆలోచిస్తూ ఉండగా లాస్య దివ్య దగ్గరకు వెళ్లి నువ్వేమైనా మీ అమ్మని అడగకూడనిది అడిగవా ఏంటి.. చదువుకోడానికి లాప్ టాప్ అడుగావు. అది కొనివ్వచ్చు కదా అని లాస్య తులసిపై లేనిపోనివన్ని చెబుతుంది. మీ అమ్మ నీకు లాప్ టాప్ కొని ఇవ్వకపోతే నేను ఉన్నాను కదా నేను కొనిస్తాను.. నీకు లాప్ టాప్ కొనిస్తానని దివ్య కు లాస్య హామీ ఇస్తుంది.
ఇక ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగానే తులసి మీటింగ్ బాగా జరిగిందని నేను తెలుగులో మాట్లాడి క్లైంట్స్ ను కన్విన్స్ చేశానాని.. ప్రాజెక్టు ఓకే అయిందని తులసి చెబుతుంది అప్పుడే ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని పరంధామయ్య పాయసం కావాలని అడుగుతుండగా.. అంతలో నందు డీల పడిపోయి ఇంటికి వస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య దివ్యకి లాప్టాప్ కొని ఇస్తుంది. దివ్య లాస్య తో ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉందని.. తను పార్టీ ఇస్తుందని ఆ పార్టీకి మమ్మీ వద్దని చెప్పింది అని దివ్య లాస్య తో చెప్పగానే స్పెషల్ క్లాస్ ఉందని మీ అమ్మకి అబద్ధం చెప్పి వెళ్ళమని లాస్య సలహా ఇస్తుంది. ఇక అదే ఐడియాను ఫాలో అవుతుంది. దివ్య వెస్ట్రన్ డ్రెస్ లో రెడీ అయ్యి తులసికి కనిపిస్తుంది. ఒకవేళ పార్టీకి వెళ్లి తిరిగి వచ్చిందా లేదా వెళ్లడానికి పర్మిషన్ అడుగుతుందా అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.