Intinti Gruhalakshmi: వాసు తులసికి నందికి ఇద్దరికీ తన భార్య చేత పసుపు కుంకుమలను అందిస్తాడు. సరిగ్గా అదే సమయానికి దీపక్ వస్తాడు. ఇప్పుడు తులసి వాళ్ళ తమ్ముడు ఎందుకు వచ్చాడు. సరిగ్గా ఈ టయానికి రావాలా దీపక్ కూడా అని నందు లో లోపల భయపడుతూ ఉంటాడు. దీపక్ నేను మీ బావ ఫ్రెండ్ ని అని వాసు పరిచయం చేసుకుంటాడు..

ఏంటి మీ అక్క బావల పెళ్లిరోజు అని విష్ చేయడానికి వచ్చావా అని అడుగుతాడు. దాంతో అంతా షాక్ అవుతూ దీపక్ వైపు చూస్తారు. వాళ్ల అక్క మొహం లి తెలియని సంతోషంతోపాటు కంగారు కనిపించడంతో దీపక్ ఆ విషయాన్ని వాళ్ళ అక్కతో తేల్చుకోవాలని మౌనంగా ఉండిపోతాడు. నందు నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి రా అంటే గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదని అలిగాను అని అనగానే .. ప్రపంచంలో అత్యంత విలువైన మా అక్కనే బహుమతిగా ఇచ్చాను అంతకంటే ఇంకా ఏదైనా విలువైన బహుమతి ఉంటే చెప్పు అది ఇస్తాను అని నందుతో అంటాడు వివేక్..

దివ్య తన పేషంట్ కి ఎక్కువ టెస్టులు రాశారని తెలుసుకొని వెంటనే ఆ విషయాన్ని సంజయ్ తో తేల్చుకోవడానికి వెళ్తుంది. ఆ లోపు సంజయ్ మరో అమ్మాయితో క్లోజ్ గా ఉండడం దివ్య తలుపు తీసేసరికి ఆ అమ్మాయి కనిపించడం జరుగుతాయి. ఇక దివ్య ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి.. అసలు ఇలాంటి టెస్టులు ఎందుకు రాశారు నేను డైరెక్ట్గా ఎండి దగ్గరే తేల్చుకుంటాను అని చెప్పి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
రాజ్యలక్ష్మి తన బిడ్డ తన మాట వినడం లేదని శివుడికి భక్తితో నిష్టగా పూజిస్తుంది . పొద్దుటి నుంచి ఉపవాసం అని ఏమి తినలేదని అంటుంది. నీరసంగా కనిపిస్తుంది . తన కొడుకు తన మాట వినాలని వేడుకుంటుంది. అప్పుడే విక్రమ్ వచ్చి నేను నీ మాట వింటాను అని అంటాడు.
నందు తులసిలా 28వ వార్షికోత్సవాన్ని ఘనంగా చేస్తారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకోకుండా ఎవరికి ఎక్కువ వాళ్ళు తింటారు. అప్పుడే నందు తులసి కోసం తీసుకున్న నెక్లెస్ చాలా బాగుంది మొన్న లాస్య అమ్మకు నందు బాబు తీసుకొచ్చిన నక్లెస్ కంటే ఇది చాలా బాగుంది అని అంటూ రాములమ్మ నోరు జారుతుంది.. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ లాస్య వైపు చూస్తారు.