Intinti Gruhalakshmi: తన కొడుకులు వాళ్లకు వచ్చిన ఆస్తిని కూడా తాకట్టు పెట్టుకోవడానికి తనకు ఇవ్వరన్నారని నందు మనసులో బాధపడతాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉంటాడు. ఆ కోపంలో నందు ఈ విషయం గురించి ఆలోచిస్తూ గులాబీ చెట్టుకి ఉన్న ముల్లుతో తన చేతికి గాయం చేసుకుంటాడు. అది చూసిన తులసి నందుకు ఒక సలహా ఇస్తుంది. మీరే సొంతంగా ఓ బిజినెస్ పెట్టుకోకూడదు అని సలహా ఇస్తుంది. నందు ను కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తుంది. నీకేం పని లేదా ఇలాంటి సలహా ఇస్తావ్ ఏంటి నా అందుకే అని లాస్య గొడవపడుతుంది.

Intinti Gruhalakshmi: నందుకు చివాట్లు పెట్టిన తులసి.. అందరి ముందు పరువు పోయిందిగా.!?
ఇక ఉదయం అందరూ లేచి టిఫిన్ చేస్తూ ఉండగా నందు కేఫే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని అందరితో చెబుతాడు. అయితే దానికి కూడా డబ్బులు కావాలని అభి అంటాడు. ముందు షాపు రెంటుకి లక్షలకు లక్షలు డబ్బులు కావాలి అని అనగానే.. ప్రేమ్ తనకు వచ్చిన ఆస్తిలో మ్యూజిక్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా ఆ పక్కన చాలా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ కేఫ్ పెట్టుకుంటాను అని నందు అంటాడు.

కానీ అందుకు కూడా ప్రేమ్ ఒప్పుకోడు. ఇక ఆ విషయం గురించి నందు దిగాలుగా ఉంటాడు. లాస్య అసలు కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకోదు. తులసి ప్రేమ్ దగ్గరకు వెళ్లి తనని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రేమ్ సాసేమిరా ఒప్పుకోనని అంటాడు.. ఎంతైనా తన తను నీకు దండ్రి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు అయినా ఉండొచ్చు.. కానీ నువ్వు ఆయనతో సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం అని తులసి అంటుంది.

నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మ ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు నీ ప్రేమ కోసం నేను కరిగిపోతున్నాను అని ప్రేమ్ అంటాడు. మొత్తానికి ప్రేమ్ తన స్థలంలోనే నందు కేసు పెట్టుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇక అందరి ముందు నందు ప్రేమే హత్తుకుని థాంక్యూ చెబుతాడు. అయితే ఈ కేఫ్ కి మన ఇంట్లో అందరికంటే చిన్నపిల్లవాడైనా లక్కీ పేరు పెడదామని తులసి అంటుంది.. లాస్య ఊహించని పేరు కేఫే బిజినెస్ కి పెట్టి తన చేతే క్లాప్స్ కొట్టించిన తులసి. లాస్య ఊహించని విధంగా తన కొడుకు పేరు పెడదాం అని చెప్పి తన దగ్గర కూడా మార్కులు కొట్టేస్తుంది తులసి.. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..