Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి తన బిడ్డ తన మాట వినడం లేదని శివుడికి భక్తితో నిష్టగా పూజిస్తుంది . పొద్దుటి నుంచి ఉపవాసం అని ఏమి తినలేదని అంటుంది. నీరసంగా కనిపిస్తుంది . తన కొడుకు తన మాట వినాలని వేడుకుంటుంది. అప్పుడే విక్రమ్ వచ్చి నేను నీ మాట వింటాను అని అంటాడు.. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని విక్రమ్ వాళ్ళ అమ్మకి మాట ఇస్తాడు.
నందు తులసిలా 28వ వార్షికోత్సవాన్ని ఘనంగా చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. ఇక కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకోకుండా ఎవరికి ఎక్కువ వాళ్ళు తింటారు. అప్పుడే నందు తులసి కోసం తీసుకున్న నెక్లెస్ చాలా బాగుంది. మొన్న లాస్య అమ్మకు నందు బాబు తీసుకొచ్చిన నక్లెస్ కంటే ఇది చాలా బాగుంది అని అంటూ రాములమ్మ నోరు జారుతుంది.. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ లాస్య వైపు చూస్తారు. అదేంటి నందు అని వాసు అడగగానే.. నాకు తెలిసిన జువెలరీ షాప్ లో డిస్కౌంట్ లోకి ఇచ్చాను అని నందు కవర్ చేస్తాడు .
ఇక పెళ్లి గురించి ఇన్నేళ్ల మీ జీవితం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పరా నందు అని అడగగానే.. తులసి విషయంలో చేసిన తప్పులు ఇండైరెక్టుగా చెబుతూ ఇప్పుడు నేను నిన్ను క్షమాపణలో అడగడం తప్ప ఇంకేమి చేయలేను అనే అర్థం వచ్చేలాగా తనని క్షమించమని వేడుకుంటాడు. అమ్మ తులసి ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పు అని అంటాడు వాసు.
నాకు ఆనందం కలిగిన సంతోషం కలిగిన ఓ పాట గుర్తొస్తుంది. కష్టానికి కృంగిపోకు సంతోషానికి పొంగిపోకు అని ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే ఆఖరికి నా కూతురు దివ్యకి కూడా అదే విషయాన్ని చెబుతాను అని తులసి అంటుంది. ప్రస్తుతం నేను ఎవరిని క్షమించే పొజిషన్లో లేను నాకు ఏది జరిగినా అది మంచే జరిగిందని అనుకుంటాను అని తులసి అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో తులసికి జ్వరం వస్తుంది. రేయ్ నందు చూస్తావేంటి మా చెల్లికి జ్వరం వచ్చింది. తనని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని వాసు చెబుతాడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నీకు సంతోషం లేదు అని నందు తులసికి సేవ చేస్తూ ఉంటాడు అది చూసిన లాస్య గుండె పగిలిపోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!