Intinti Gruhalakshmi: నాన్న తులసి ఎక్కడ ఇంకా లెగవలేదా అని అంటుండగా.. ఖరీదైన నగలు కొని పెట్టడమే కాదు.. తన బాగోగులు కూడా చూసుకోవాలి అని వాసు నందు తో అంటాడు. తులసికి జ్వరం వస్తుంది. రేయ్ నందు చూస్తావేంటి మా చెల్లికి జ్వరం వచ్చింది. తనని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని వాసు చెబుతాడు. ఇక గబగబా నందు తులసి దగ్గర కి వెళ్లి చూస్తే.. ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది.
ఇక వేడి నీళ్లతో తుడుస్తాడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నీకు సంతోషం లేదు అని నందు తులసికి సేవ చేస్తూ ఉంటాడు. అది చూసిన లాస్య గుండె పగిలిపోతుంది. కావాలని తులసి కి దగ్గర ఆవుతున్నవు అంటూ లాస్య నందు ని అరుస్తుంది. అప్పుడే వాసు వస్తాడు..కేఫ్ కి నందు ని తనతో పాటు రమ్మని పిలుస్తున్నాను అని అంటుంది. వాడు రాడు నువ్వు వెళ్ళు అని వాసు అంటడు. అవును అని నందు తల ఉపుతాడు. నందు కేఫ్ కి రాడు ఆ బాధ్యతలని నువ్వే చూసుకో పో అని వాసు నాశనం అక్కడ నుంచి పంపించేస్తాడు.
ఇక కూరగాయలు కొందామని విక్రమ్ వెళ్తుండగా.. దివ్య కూరగాయలు కొంటూ కనిపిస్తుంది ఇక వెళ్లి తను కూడా కూరగాయలు కొంటాడు. అప్పుడే దివ్య తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో విక్రంతో పంచుకుంటుంది. వంట చేసేవాడు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది. అంతేకాకుండా నీకు నచ్చిన భార్య ఎలా ఉండాలో చెప్పుమని విక్రమ్ ని అడుగుతుంది. దివ్య ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్లడం భాగ్య చూస్తుంది. ఇక అదే విషయాన్ని లాస్యతో కూడా చెబుతుంది.
దివ్య టైర్ పంచర్ అవడంతో విక్రమ్ తన కారులో లిఫ్ట్ ఇస్తాడు. విక్రమ్ కారులోకి దివ్య ఎక్కుతుండగా భాగ్య ఫోటోలు తీసి ఆ ఫోటోలను లాస్యకు పంపిస్తుంది. విక్రమ్ దివ్య కారులో వెళ్తుండగా ఒక బైక్ అడ్డం వచ్చి ఢీ కొట్టుకుంటారు. బండి మీద ఉన్న అబ్బాయి తన లవర్ ని తక్కువ చేసి మాట్లాడుతుండగా విక్రమ్ కల్పించుకొని ప్రేమ గురించి అద్భుతంగా మాట్లాడుతాడు. ఆ మాటలు వినగానే దివ్య ఫ్లాట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్తూ విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తుంది . మనసులో ఈ అబ్బాయి ఏంటి నాకు రోజురోజుకీ నచ్చేస్తున్నాడు అని అనుకుంటుంది.