Intinti Gruhalakshmi: సామ్రాట్ వాళ్ళ ఇంటికి లక్కినీ తీసుకుని లాస్య, నందు వస్తారు.. లక్కీని హానికి దగ్గర చేయాలని తనని ఇక్కడికి తీసుకువచ్చారు.. థ్యాంక్యూ నందు లక్కీ ను ఇక్కడికి తీసుకు వచ్చి నాకు సగం భారం తగ్గించావు అని సామ్రాట్ అంటాడు.. మీరు మమ్మల్ని ఎంప్లాయిస్ గా చూసినా.. మేము మాత్రం మిమ్మల్ని మా సొంత మనిషిగా భావిస్తున్నాం అని లాస్య అంటుంది.. అప్పుడే తులసి హనీ కోసం టిఫిన్ చేసి తీసుకువచ్చాను అని అంటుంది..! సామ్రాట్ కి తన నిర్ణయం చెప్పాలని అనుకుంటుంది..
సామ్రాట్ నందు తో హనీ కోలుకునే వరకు నేను ఆఫీస్ కు రానని.. ఆఫీస్ ఇంట్లోనే ఏర్పాటు చేయమని.. అందుకు కావల్సిన ఏర్పాట్లు చేయమని నందు తో సామ్రాట్ తో చెబుతాడు.. మీ డెసిషన్ బాగుంది సార్ అని చెప్పి నందు ,లాస్య అక్కడి నుంచి వచ్చేస్తారు.. లాస్య ఆ సామ్రాట్ ఇంట్లోనే ఆఫీస్ అంటాడు ఏంటి నాకు చాలా ఎడిటింగ్ గా ఉంటుంది పైగా ఇంట్లో ఆ తులసి ఓవరాక్షన్ కూడా చూడలేకపోతున్నాను అని నందు అంటాడు మనకి ఒక అవకాశం పోయినా ఇంకొక అవకాశం ఉంది లక్కీ అని ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. మనం అవకాశాలు యూస్ చేసుకోవాలి అని అంటుంది.
తులసి సామ్రాట్ దగ్గరకు వచ్చి హానికి యాక్సిడెంట్ అయ్యింది కదా.. అందుకని కొద్దిరోజుల పాటు హనీ ని నాతోపాటు మా ఇంటికి తీసుకు వెళ్తాను అని తులసి అంటుంది.. నన్ను వదిలిపెట్టి రాగలదేమో.. నేను తనని వదిలిపెట్టి ఉండలేను.. అదేదో మీ ఫ్యామిలీ అంతా మా ఇంటికి రండి.. ఏ లోటు రాకుండా చూసుకుంటానని సామ్రాట్ అంటాడు.. తులసి ఇంటికి వెళ్లి సామ్రాట్ చెప్పిన నిర్ణయం చెబుతుంది.. అభి సామ్రాట్ డెసిషన్ విని ఫైర్ అవుతాడు.. మొత్తానికి తులసి తన ఫ్యామిలీ ను తీసుకుని సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. నందు మాత్రం నువ్వు వాళ్ళ ఇంటికి సేవలు చేయడానికి వచ్చినట్టు లేదు.. ఆ ఇంట్లో పర్మినెంట్ గా ఉండటానికి వచ్చినట్టు ఉందని తులసికి ఊహించని షాక్ ఇస్తాడు.. మరి తులసి ఏం అంటుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం…