20.7 C
Hyderabad
December 7, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని రెండో పెళ్లి చేసుకోమన్న సామ్రాట్..! దిమ్మతిరిగే జవాబు.!

Share

Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ ఇద్దరూ మీటింగ్ కంప్లీట్ చేసుకుని దారిలో కనిపించిన ఓ టెంపుల్ దగ్గర ఆగుతారు.. సామ్రాట్ ను టెంపుల్ లో చూసి ఓ ఇద్దరమ్మాయిలు చాలా బాగున్నాడు.. హ్యాండ్సమ్ గా ఉన్నారు అని అనుకుంటారు.. తను ఒప్పుకుంటే ఇక్కడే మూడు ముళ్ళు వేయించేసుకోవాలని ఉంది అని అన్న మాటలను విని తులసి పకాపకా నవ్వేస్తుంది.. సామ్రాట్ సిగ్గుతో తలదించుకుంటాడు. మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని తులసి అడుగుతుంది.. నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలో కూడా మీకు తెలుసు అని సామ్రాట్ అంటాడు.. హనీ కోసమే కదా అని తులసి ఉంటుంది.. కొంతమంది హనీ ని ఒప్పుకున్నారు.. కానీ వాళ్ళ కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపించలేదు.. అందుకే ఇలాగే ఉండిపోయాను అని సామ్రాట్ అంటాడు..

Intinti Gruhalakshmi Serial 25 October 2022 Today 772 episode highlights
Intinti Gruhalakshmi Serial 25 October 2022 Today 772 episode highlights

నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని తులసితో సామ్రాట్ అంటాడు.. ఆడగమని తులసి అంటుంది.. మీరు కూడా ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా అని సామ్రాట్ అంటాడు.. ఆల్రెడీ నా జీవితంలో కోలుకోలేని దెబ్బ నాకు తగిలింది.. అది కాదనుకొని ఇంకొకసారి నా మనసుని బాధ పెట్టాలని అనుకోవడం లేదు .. ప్రస్తుతం నేను నా ఎదుగుదల నా పిల్లల భవిష్యత్తు నేను ముందుకు ఎలా వెళ్లాలి అని ఆలోచన తప్ప మరో ఆలోచన నాకు లేదు అని తులసి అంటుంది.. ఆ మాటలకు సామ్రాట్ మనసులో మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు అని అనుకుంటాడు..

సామ్రాట్ తులసి ఇద్దరూ కారు తుఫానులో ఇరుక్కుంటుంది.. ఇక ఎలాగోలా తుఫాన్ నుంచి తప్పించుకోడానికి కారు పక్కన పార్క్ చేసి ఇద్దరూ బయటకు రావాలని అనుకుంటారు.. సామ్రాట్ గొడుగు తీసి తులసికే ఇస్తాడు ఈ గొడుగు లో వెళ్దాము అని.. ఓ ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో నుంచి తులసి వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తుంది సేఫ్ గా ఉన్నానని చెబుతుంది.. సిగ్నల్ లేక మధ్యలో కాల్ కట్ అవుతుంది..

అనసూయమ్మ నందు దగ్గరకు వచ్చి ఇంట్లో ఉన్న పరువంతా తులసి రోడ్డు మీద పడేసే లాగా ఉంది అని అంటుంది.. ఆ మాటలకు నందు ఇక తులసి ఏం చేస్తుందో తెలుసుకుందామని మళ్ళీ అదే నెంబర్ కు ఫోన్ చేస్తాడు.. అప్పుడే తులసి సామ్రాట్ ఇద్దరు ఒకే బెడ్ రూమ్ లో ఉన్నారని వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటున్నారని అక్కడ ఉన్న ఒక అతను చెబుతాడు అది విని నందు షాక్ అవుతాడు.. తులసి ఈరోజు రాత్రికి ఇంటికి రాకపోతే మన అంతు చూస్తాను అని అనసూయమ్మ మనసులో అనుకుంటుంది.. మరోవైపు లాస్య కూడా తులసి వచ్చేసరికి ఇల్లంతా అగ్నిగుండం లాగా మారిపోయేలా చేస్తాను అని అనుకుంటుంది.. ఇక తులసి ఈ అవమానాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి..


Share

Related posts

Adipurush: “ఆదిపురుష్” కి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చిన హీరోయిన్ కృతి సనన్..!!

sekhar

Bunny Ramcharan: బన్నీ- రామ్ చరణ్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..??

sekhar

ప్ర‌భాస్‌కు వీరాభిమానిని అంటున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ!

kavya N