Intinti Gruhalakshmi serial today 775 episode Highlights, ,Intinti Gruhalakshmi serial 28 October 2022 today 775 episode Highlights,ఇంటింటి గృహలక్ష్మి సీరియల్,Intinti Gruhalakshmi serial today episode
Intinti Gruhalakshmi: బురద లో కాలు పెట్టీ మట్టి అంటలేదు అంటావు ఏంటి తులసి అని అనసూయమ్మ అంటుంది.. ప్రపోజల్, ఫస్ట్ నైట్ అయిపోయింది మరి పెళ్లి ఎప్పుడూ అని అడుగుతాడు.. ఎనఫ్ మిస్టర్ నందగోపాల్ అని ప్రేమ్ అంటాడు.. అమ్మ హద్దులు దాటింది అని అభి అంటాడు.. నోరు ముయ్ నువ్వు హద్దులు దాటావు అని అనసూయమ్మ అంటుంది.. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని తులసి అంటుంది.. నేను గత 25 ఏళ్లు గా ఏదైనా తప్పైనా చేశానా.. అలాంటిది ఇప్పుడు పాపం ఎలా చేస్తాను.. అలా మాటలు ఎలా అంటారు అత్తయ్య.. మీరు కూడా ఈయన లాగా ఎలా అంటారు.. ఇక నుండి ఏం అనుకుంటారో అనుకోండి అని తులసి అంటుంది.. అయితే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తావా అని అడిగాడు నందు.. చాలు ఇంకా అని తులసి అంటుంది.. మనసులో అనుమానం రేకెత్తితే మేము ఇలాగే అడుగుతాం.. నువ్వు ఏం చేస్తావు అని నందు అంటాడు..
చాలు దీనిని ఇక్కడితో ఆపేయండి అని తులసి అంటుంది.. చీకట్లో ఆ సామ్రాట్ తో ఏం చేసావో చెప్పు అని అనసూయమ్మ అంటుంది.. ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పాను కానీ సామ్రాట్ కి నాకు స్నేహం తప్పితే వేరే ఏమీ లేదు.. నమ్మితే నమ్మండి లేకపోతే చావండి అని ఏడుస్తుంది తులసి.. నీ ముసలి కన్నీళ్లు నాకు అవసరం లేదు అని అనసూయమ్మ అంటుంది. ఇప్పుడు నీకు ఆ డబ్బులు ఉన్న ఆ సామ్రాట్ మీద గాలి తగిలింది అని లాస్య అంటుంది.. తల్లిగా తప్పు చేస్తే పిల్లలు ముందు ఇలాగే తల దించుకోవల్సి వస్తుంది..
ఈ ఇంటి కోసం నేను ఏం చేశానో నేను లెక్క పెట్టడం మొదలు పెడితే.. మీ వేళ్ళు, మీ వేళ్ళు ఊర్లో అందరి వేళ్ళు లెక్కపేట్టినా మీ అందరి వీళ్ళు కూడా సరిపోవని తులసి అంటుంది.. ఇక చాలు రోజు నేను మీ అందరి ముందు మాటలు పడుతూ అగ్నిపరీక్షకు నిలబడలేను అని అంటుంది ఇలా నీతిమాలిన పనులు చేస్తే అగ్ని పరీక్షకు నిలబడాల్సి వస్తుంది. అసలు మీరెవరు అగ్నిపరీక్షకు నిలబడమని చెప్పడానికి అని తులసి అంటుంది.. అగ్ని పరీక్ష కట్టడానికి రాముడికి అర్హత ఉంటుంది.. రావణాసురుడికి కాదు అని తులసి అనగానే.. అనసూయమ్మ కోపంగా తులసి అని పెద్దగా అరుస్తుంది.. హా అంటూ తులసి చెయ్యి చూపిస్తుంది.. ఇలాంటి మాటలు వినాల్సిన రోజు ఒకటి వస్తుందని మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టినప్పుడు అనుకోలేదు.. భర్త నుండి విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఈ మాట వినాల్సి వస్తుంది అని.. దయచేసి ఇంకొక మాట కూడా అనకండి.. భరించలేదు లేదు అని తులసి అంటుంది.. నా వ్యక్తిత్వాన్ని, పవిత్రతను అవహేళన చేశారు అత్తయ్య.. ప్రశ్నించారు.. నేను ఇంత జరిగాక కూడా ఈ ఇంట్లో ఉండాలి అనుకోవడం లేదు.. వ్యక్తిత్వం మీద మీరు వేసిన నిందకు నేను ఈ ఇంట్లో ఉండను అని అంటుంది..
అప్పుడే లాస్య నీ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది తులసి.. వెంటనే నీ ప్లాన్ వర్క్ అవుట్ అయిందని సామ్రాట్ తో చెప్పమంటావా.. కోట్ల రూపాయల కారు తీసుకొని నీ ముందు వాలిపోతాడు.. నిన్ను ఊరేగించుకుంటూ తన ఇంటికి తీసుకెళ్తాడు.. వెంటనే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా.. లేదంటే కొన్ని రోజులపాటు సహజీవనం చేస్తారా.. అదే ఫారన్ కంట్రీస్ లో చేస్తారు కదా రిలేషన్షిప్ అలాగా అని లాస్య అడుగుతుంది.. అలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా అని తులసి అంటుంది..
ఆవేశంతో నన్ను అన్నన్ని మాటలు అన్నారే.. ఆ మాటలన్నీ అనాల్సింది నన్ను కాదు.. మీ కొడుకుని, మీ కోడల్ని.. ఎన్ని మాటలు పడుతూ నేను ఈ ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతాను అని తులసి అంటుంది.. ఇంట్లో వాళ్ళందరూ తులసిని వెళ్లదు అని అడ్డుపడతారు.. అప్పుడే పరంధామయ్య వచ్చి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటాడు.. ఏం జరుగుతుందో తరువాయి చూద్దాం..
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!