Intinti Gruhalakshmi: లాస్య దగ్గరకి అనసూయమ్మ వెళ్లి భార్య ఉండాల్సిన లక్షణం ఇది కాదు.. నందు తో నువ్వు ఎలా మసులు కోవలో అనసూయమ్మ చెబుతుంది.. అనసూయమ్మ చెప్పిన ఆ పద్యాన్ని లాస్య నందును వివరణ కోరగా .. నందు లాస్య కి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాడు.. అయితే ఇక లాస్య ఎలా ఉండాలో డిసైడ్ అవుతుంది. నందు కేఫ్ పెట్టుకోడానికి ఒప్పుకుంటుంది. కాకపోతే ఒక కండిషన్ మీద అదేంటంటే.. మూడు నెలలు లో మంచి గ్రోత్ ఉంటేనే.. లేకపోతే నేను ఊరుకోను అని అంటుంది..

తులసి ప్రేమ్ దగ్గరకు వెళ్లి తనని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రేమ్ సాసేమిరా ఒప్పుకోనని అంటాడు. ఎంతైనా తన తను నీకు అన్నదండ్రి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు అయినా ఉండొచ్చు.. కానీ నువ్వు ఆయనతో సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం అని తులసి అంటుంది నువ్వు ఎప్పుడు ఇంతే అమ్మ ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు నీ ప్రేమ కోసం నేను కరిగిపోతున్నాను అని ప్రేమ్ అంటాడు . మొత్తానికి ప్రేమ్ తన స్థలంలోనే నందు కేసు పెట్టుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇక అందరి ముందు నందు ప్రేమే హత్తుకుని థాంక్యూ చెబుతాడు .

అయితే ఆ కేఫ్ కి తులసి పేరు పెడతాం అని అంటాడు పరంధామయ్య. లాస్య ఆ పేరు తప్ప ఇంకో పేరు దొరకలేదా అనగానే.. ఈ కేఫ్ కి మన ఇంట్లో అందరికంటే చిన్నపిల్లవాడైనా లక్కీ పేరు పెడదామని తులసి అంటుంది. లాస్య ఊహించని విధంగా తన కొడుకు పేరు పెడదాం అని చెప్పి తన దగ్గర కూడా మార్కులు కొట్టేస్తుంది.

అభి తన అత్తగారైన గాయత్రి ను కలుస్తాడు. మీ నాన్న కేఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కదా అని అవమానంగా అంటుంది. అప్పుడే అభి నన్ను ఏం చేయమంటారు ఆంటీ.. ఇక్కడికి రావాలి అంటే మీరు ఒక కండిషన్ పెట్టరుగా.. అని అంటాడు. నువ్వు తన దారిలోకి వెళ్లి నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయమని సలహా ఇస్తుంది.. అప్పుడే అంకిత నీ మాట వింటుంది. అప్పుడు తనని తీసుకుని ఈ ఇంటికి రమ్మని చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో నందు లాస్య ఇద్దరు కూర్చుని.. ఆ కేఫ్ కు కావాల్సిన డబ్బుల విషయం గురించి మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో అంత డబ్బులు సహాయం చేయగలిగేది అభి ఒక్కడే అని లాస్య అంటుంది.. తన వెనుక వాళ్ళ అత్తయ్య గాయత్రి ఉందిగా .. అభి అడిగితే ఎంతైనా ఇస్తుంది అని అంటుంది. అవును నేను అడిగితే మా అత్తయ్య ఎంతైనా ఇస్తుంది. కాకపోతే ఆమె కండిషన్ ఒకటి ఉంది. అంకిత నేను వాళ్లింట్లో ఉండాలి అని అభి అంటాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.