Intinti Gruhalakshmi: ఏంటి దివ్య ఇంకా నిద్రపోలేదు అసలే రేపు పొద్దున నీకు పెళ్లిచూపులు. త్వరగా నిద్రపోతే పెళ్ళికొడుకుకి ఫ్రెష్ లుక్ లో కనిపిస్తావు అని శృతి ఆటపట్టిస్తుంది. చాల్లే వదిన అని తన పక్కనే ఉన్న డబ్బులు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఈ డబ్బులు ఏంటి అంటే ఒక అతను ఇచ్చాడు అని చెబుతోంది. దాంతో శృతి దివ్యను ఆటపట్టిస్తుంది. అంత లేదులే వదినా అసలు విషయం తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అని దివ్య అంటుంది.

హాస్పిటల్లో ఒక పిల్లాడి యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఒక అతను అనుకుని మరొక అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను. అవి తనకి వెనక్కి వెయిట్ చేయాలని చూస్తుంటే తన ఫోను కలవడం లేదు అని దివ్య చెబుతుంది.. అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే ఏంటి.. తను మీద నీకు మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలని తను ట్రై చేస్తున్నాడు ఆ మాత్రం అర్థం కావడం లేదా అని శృతి అంటుంది..

ఇంట్లో దివ్య పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి .అందరూ అదోలా ఉన్నారు ఏంటి అని లాస్య వచ్చి హడావుడి చేస్తూ అడుగుతుంది . అసలు దివ్య అయినా రెడీ అయిందా అని అడుగుతుంది. లోపల శృతి రెడీ చేస్తుంది అని తులసి సమాధానం చెబుతుంది. అవును దివ్య నాతో ఇందాక ఎవరితోనో ఫోన్ చేస్తాను అని చెప్పావు. ఫోన్ చేసావా అని శృతి దివ్యని అడుగుతుంది. ఇక దివ్య విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. మీ అబ్బాయి గారికి ఫోన్ ఇవ్వు ఒకసారి మాట్లాడాలి అని దివ్య అంటుంది. అతను విక్రమ్ కి ఫోన్ ఇవ్వకుండా విక్రమ్ గురించి మంచిగా చెప్పి కాల్ కట్ చేస్తాడు.
దివ్య పెళ్లి చూపులు చూసుకోవడానికి నందు స్నేహితుడు తన కుటుంబంతో కలిసి వస్తాడు. ఇక పెళ్ళికొడుకు దివ్య నచ్చేస్తుంది. మా ఇంట్లో వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే అని చెబుతాడు. ఇక ఆ పెళ్లి సంబంధం కాదు దివ్య అందరి ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. దాంతో అక్కడి నుంచి వాళ్ళు లేచి వెళ్ళిపోతారు అసలు ఈ సంబంధం చెడిపోవడానికి తులసినే కారణం దివ్య ను ఈ పెళ్లి చేసుకోవద్దని తులసినే చెప్పుకుంటుంది. ఎక్కడ దివ్య ఈ పెళ్లి చేసుకుంటే ఆ క్రెడిట్ అంతా నాకు వస్తుందని తులసి అనుకుంది. అందుకే ఇలా చేసింది అని లాస్య ఎప్పటి లాగానే తులసి మీద పడి ఏడుస్తుంది.