Intinti Gruhalakshmi: విక్రమ్ ప్రియని ఇంట్లో చూడగానే.. తిను ప్రియా కదా ఇక్కడేందుకు ఉంది అని అడగగానే. తన స్థాయి, హోదా మారిపోయింది ఇప్పుడు.. తను సంజయ్ భార్య అని విక్రమ్ తాతయ్య చెబుతాడు అవునన్నయ్య ప్రియ విషయంలో నేనే చిన్న తప్పు చేశాను. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని సంజయ్ చెబుతాడు.

ఇక ఇంట్లోకి రావడానికి దోషం ఉందని.. 101 ఒక్క రోజులు 101 బిందెలతో నీళ్లు పోసి అమ్మవారికి పూజ చేయాలని చెప్పగానే.. దోషమంటే.. గుర్తుకు వచ్చింది. భార్యాభర్తల విషయంలో దోషం ఉంటే అది ఇద్దరికీ వర్తిస్తుందని పూజలో కూడా ఇద్దరూ సగం సగం పూజ చేసుకోవచ్చని ప్రియ ఒక్కటే 101 బిందులు మోస్తే తన ఆరోగ్యం బాగోదని.. తనకి నువ్వు హెల్ప్ చేయమని సంజయ్ కి సమాధానం చెబుతాడు విక్రమ్. సంజయ్ నీళ్లు మోసి తీసుకొని చేస్తే ప్రియా పూజ చేస్తుందని .. అలాగే ప్రియా అవుట్ హౌస్ లో ఉంటే సంజయ్ కూడా తనకి అండగా అక్కడే ఉండాలని.. తనకి సపోర్ట్ గా ఉండాలని విక్రమ్ ఆదేశిస్తాడు.
విక్రమ్ ఏంటి ప్రియకి సపోర్ట్ చేస్తున్నాడు అని రాజ్యలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఈ విషయంలో విక్రమ్ నాకు ఏకుకి మేకయ్యేటట్టు ఉన్నాడు అని అనుకుంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు ప్రియని చూస్తూ మా అమ్మ చాలా మంచిదని ఆ అమ్మవారు ఎంత మంచిగా పవిత్రంగా ఉంటారు. మా అమ్మ మనసు కూడా అంతే మంచిగా ఉంటుందని నీకు ఏ చిన్న కష్టం వచ్చినా.. అమ్మాయికి సంజయ్ కి చెప్పు అని వాళ్ళిద్దరూ అందుబాటులో లేకపోతే నాకు చెప్పమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. ఇక విక్రమ్ చెప్పింది చేయమని సంజయ్ కి చెప్పి రాజ్యలక్ష్మి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సంజయ్ ని చూస్తూ చేసిన తప్పు ఊరికినే పోతుందా అంటూ వాళ్ళ తాతయ్య వెక్కిరిస్తాడు..
అమ్మ దివ్య నీకు ఏదో బొకే వచ్చింది అంటూ లాస్య బొకే తీసుకొని వస్తుంది. నిన్న రాత్రి కూడా ఒకే వచ్చింది కదా అని తులసి అంటుంది. చూస్తానని లాస్య గొడవ చేస్తూ ఉండగా ఆంటీ నా బొకే నాకు ఇచ్చేయండి అని దివ్య అంటుంది. తులసి దివ్యతో నేను ఇంక పరిగెత్తలేను కానీ ఈ బొకే మీద ఎవరు పేరు ఉందో నువ్వే చూడు అని లాస్య ఇస్తుంది. బొకే మీద ఫ్రెండ్ అని రాసి ఉండటంతో దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మ దివ్య టిఫిన్ చెయ్యడానికి రా అని అనగానే ఇప్పుడు కాదు అని అంటుంది. ఇక దివ్య ప్రవర్తనలో చాలా మార్పులు గమనిస్తున్న లాస్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. దానికి తగ్గట్టే దివ్య ప్రవర్తన కూడా ఉంటుంది ఇక విగ్రహం ఫోన్ చేస్తే ఎవరికీ తెలియకుండా ఉండాలని ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టి తన నడుము దగ్గర పెట్టుకుంటుంది. అక్కడి నుంచి టిఫిన్ వద్దంటూ లేచి వచ్చి విక్రమ్ తో మాట్లాడుతుంది. దివ్యని కలవాలని ఉంది అని చెప్పగానే రెస్టారెంట్ కి రమ్మని చెబుతుంది .
లాస్య కి రాజ్యలక్ష్మి ఫోన్ చేసి కలవాలి. నీకు లాభం వచ్చే పని అని రాజ్యలక్ష్మి చెబుతుంది. అసలు మీరెవరు అని అడగగానే వస్తే నీకే తెలుస్తుంది కదా అని రాజ్యలక్ష్మి అంటుంది. రాజ్యలక్ష్మి ని కలిసిన తర్వాత విక్రమ్ దివ్యని ప్రేమిస్తున్నాడని మీకు తెలియకుండా పెద్ద వ్యవహారమే చేస్తున్నాడని.. విక్రమ్ కి దివ్యని ఇచ్చి పెళ్లి చేయమని సలహా ఇస్తుంది లాస్య.