Intinti Gruhalakshmi: నందు లాస్య ఇద్దరు కూర్చుని.. ఆ కేఫ్ కు కావాల్సిన డబ్బుల విషయం గురించి మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో అంత డబ్బులు సహాయం చేయగలిగేది అభి ఒక్కడే అని లాస్య అంటుంది.. తన వెనుక వాళ్ళ అత్తయ్య గాయత్రి ఉందిగా .. అభి అడిగితే ఎంతైనా ఇస్తుంది అని అంటుంది. అవును నేను అడిగితే మా అత్తయ్య ఎంతైనా ఇస్తుంది. కాకపోతే ఆమె కండిషన్ ఒకటి ఉంది. అంకిత నేను వాళ్లింట్లో ఉండాలి అని అభి అంటాడు.

నువ్వేమంటావు అంకిత అని లాస్య అడుగుతుంది. ఈ విషయంలో నాది ఎప్పటికీ ఒకటే మాట. ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనేది కుదరని మాట. తులసి ఆంటీ కోరిక మేరకు అందరం ఇంట్లోనే ఉమ్మడిగా కలిసి ఉండాలి అని అంటారు. అంతలో తులసి వచ్చి ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది అందరూ ఒక్కసారిగా తులసి వైపు చూస్తారు.

Intinti Gruhalakshmi: తులసికి దూరమవుతున్న అభి.. గాయత్రి ఆలోచన.. లాస్య కోరిన సాయం.. రేపటికి సూపర్ ట్విస్ట్..!
సామ్రాట్ గారికి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి కెఫీకి సంబంధించిన బిజినెస్ వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్లకి తక్కువ మొత్తంలో డబ్బులు కడితే వాళ్ళు ముందుగా సామాన్లు ఇస్తారు ఆ తరువాత ఇన్స్టాల్మెంట్ చొప్పున ఆ డబ్బులు కట్టొచ్చు అని తులసి చెబుతుంది. సామ్రాట్ హరిప్ అంట నీకు ఓకేనా అని లాస్య అంటుంది. కేవలం ఆయన మాట సహాయం మాత్రమే చేస్తారు. డబ్బులు కట్టుకోవాల్సింది మీరే అని తులసి అంటుంది.

ఆ మాటలకు అభి మనసులో చా.. బంగారం లాంటి ఆఫర్ మిస్ అయింది. ఈ దెబ్బతో అంకితను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. నా కెరియర్ ఫుల్ గా సెట్ అయిపోతుంది.
అని అనుకున్నాను. ఇంతలో మామ్ వచ్చి ఇదంతా స్మాష్ చేసింది అని అభి మనసులో అనుకుంటాడు. అభి తన గదిలోకి రాగానే అంకిత దూరంగా జరుగుతుంది. ఏమైంది అంకిత అలా ఉన్నావు అని అడుగుతాడు అభి.. ఏం జరిగిందో నీకు తెలియదా నువ్వు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నావు..
నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాలని అనుకున్నావు ఆ మాత్రం అర్థం కావడం లేదా అని అంకిత అంటుంది. నిజంగా నా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు అని అభి అంకితకు నచ్చ చెబుతాడు. ఇక ఇంట్లో అందరూ తలా ఒక బైక్ మీద కెఫేకి సంబంధించిన ప్లేస్ చూడడానికి వెళ్తారు. ఆ ప్లేస్ అంతగా బాగోదు. శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ స్థలాన్ని చూసి ఆలోచనలో పడతారు.
ఇక రేపటి ఎపిసోడ్లో కేఫ్ ఓపెనింగ్ కి ఎవరెవరిని పిలవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ టిఫిన్ స్నాక్స్ ఏం పెట్టాలో అని మాట్లాడుకుంటూ ఉండగా అభి వస్తాడు.. పరంధామయ్య కేఫ్ గురించి చెబుతుండగా అదేదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లా.. మళ్ళీ అందరూ ఎందుకు అంత డిస్కషన్ చేస్తున్నారు అని అబి చిరాగ్గా అంటాడు. ఆ మాటలకు అంకిత సరిగ్గా మాట్లాడు అభి అని అంటుంది. నువ్వు కూడా మా మామ్ లాగా నన్ను విసిగిస్తూ ఉంటే.. ఎప్పుడో మా అమ్మకు పెట్టిన గతే నీకు పడుతుంది. మనిద్దరం విడాకులు తీసుకోవాల్సి వస్తుంది అని అభి అందరి ముందు అంకితను తక్కువ చేసి మాట్లాడతాడు. ఇక అంకిత అభి మాట్లాడిన మాటలకు తులసి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.