Intinti Gruhalakshmi: తులసి ని గట్టిగా హత్తుకుని నన్ను క్షమించు అనవసరంగా ఈ పెళ్లిచూపులు చెడగొట్టుకున్నాను అని దివ్య అంటుంది. కానీ నాకు నిజంగానే అతని మాటలు నచ్చలేదు. అందుకే అందరి ముందు వద్దు అని చెప్పాను అని దివ్య అంటుంది. ఇక మరుసటి రోని తులసి దివ్య షాపింగ్ కు వెళ్తారు. అక్కడ అజయ్ కనిపిస్తాడు. ఈ సంబంధం చెడిపోయినందుకు మీరు బాధపడుతున్నట్టున్నారు అని తులసి అంటుంది..

అందుకు అజయ్ మీ అమ్మాయి ఏం పెద్ద అందగత్తె కాదు . ఇంతకుముందు నా మొదటి భార్య కూడా ఇలాగే ఉంటే తనకి విడాకులు ఇచ్చి వదిలి చేసుకున్నాను అని అజయ్ చెబుతాడు. ఏంటి నీకు ఇది రెండో పెళ్ళా.. అవును ఈ విషయం లాస్యకు తెలియదనుకుంటా అని తులసి అనగానే.. తనకి కూడా ఈ విషయం తెలుసు తనకి అన్నీ తెలుసు అయినా కావాలనే ఈ సంబంధం కుదరచడానికి ప్రయత్నించింది అని అజయ్ చెప్పడంతో.. తులసి కంగు తింటుంది తను ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఇదంతా చేసింది. ఇంకోసారి ఆ లాస్య కనిపించాలి తనని ఏం చేస్తానో నాకే తెలియదు అని అజయ్ అంటాడు.

పోనీలే ఈ సంబంధం తప్పినందుకు సంతోషంగా ఉంది అని తులసి అంటుండగా అయినా నాకేం తక్కువ కావాల్సినంత అందం హస్తి ఉంది అని అజయ్ వెర్రవీగుతాడు. మీ దగ్గర ఏముంది అని అనగానే మా దగ్గర ఆత్మాభిమానం ఉంది అని తులసి అంటుంది .అజయ్ కి దివ్య వార్నింగ్ ఇస్తుంది. నీ మాటలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని స్ట్రైట్ గా చెబుతుంది దివ్య.

తులసి కోపంగా ఇంటికి వెళుతుంది. లాస్య అని పెద్దగా అరిచి తన రాగానే ఒక్కటి పీకాలని చెయ్యెత్తుతుంది. అసలు ఏమైంది తులసి అని నందు అడగగా.. దివ్యకి రెండో సంబంధం అబ్బాయితో ఈ పెళ్లి చేయాలని అనుకుంటుంది. లాస్య అని ఉన్న విషయాన్ని కుండబద్దలు కొడుతుంది. అవును అదే నిజం అని రాసి అంటుంది ఇప్పుడు తులసిని మీ నాన్న వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు ప్రాక్టికల్ గా ఆలోచించు దివ్య అని లాస్య దివ్యను కన్వీస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి తన కొడుకు విక్రమ్ కి ఓ మంచి పెళ్లి సంబంధం చూస్తున్నాను అని చెబుతుంది. అప్పుడే విక్రమ్ తనకి దివ్య అంటే ఇష్టమని హాస్పిటల్ లో పరిచయమైందని చెబుతాడు.
