Intinti Gruhalakshmi: తులసి నా వాళ్లను తన వైపు తిప్పుకునే లోగా నేను తనతో ఇంట్లో వాళ్ళ బంధాలను తెంపేయాలి అని అనసూయమ్మ అంటుంది. అప్పుడే మాధవి వచ్చి నేను కూడా ఈ ఇంట్లో వాళ్ళ బంధాలను తెంచుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఏమైందమ్మా అని అనసూయమ్మ అడుగుతుంది. తులసి లాంటి పవిత్రమైన తులసి వదినను మీరు తప్పుగా మాట్లాడడం ఏం బాగోలేదు అంటూ మాధవి చెబుతుంది. దేవత లాంటి తులసి వదినను అవమానించి బయటకు పంపించారు అసలు మీకు మనసు ఎలా వచ్చింది అమ్మ అంటూ మాధవి ప్రశ్నిస్తుంది.
కోర్టులు కూడా దోషులుగా గుర్తించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. కానీ మీరు నిమిషాల్లో నిందలు వేసి క్షణాల్లో శిక్షలు అమలు చేస్తున్నారు రా అన్నయ్య అంటూ మాధవి ఫైర్ అవుతుంది. చిన్నప్పటినుంచి నేను నీకు చేసిందంతా మర్చిపోయావా ఈరోజు మధ్యలో వచ్చిన మీ తులసి వదిన నీకు మంచిది అయిపోయిందా అని నందు ప్రశ్నిస్తాడు. చిన్నప్పటినుంచి నీకు స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, నువ్వు కాలేజీ వెళ్లడానికి బైక్ కొనిచ్చింది.. నీ పెళ్లి చేసింది. ఇదంతా ఎవరు చేశారు 40 ఏళ్ల నీ అన్నయ్య కష్టాన్ని మర్చిపోయావు కానీ.. మీ వదిన తో ఉన్న అనుబంధం మాత్రం నీకు బాగా గుర్తుంది అని నందు అంటాడు..
నువ్వే అన్నావుగా నన్ను రాక్షసుడు దుర్మార్గుడివి అని అందుకే నువ్వు నా నేను ఇంతవరకు ఖర్చు పెట్టినంత నాకు ఇచ్చేసేయ. నాకు ఇచ్చేసి నువ్వు తులసి దగ్గరికి వెళ్ళిపో అని నందు అంటాడు. ఇక ఆ మాటలకు కోపం వచ్చినా మాధవి నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా నీకు ట్రాన్స్ఫర్ కొట్టాను. ఇంకా కావాలి అంటే చెప్పు పైసా పైసా కూడబెట్టి మరి నీకు ఇచ్చేస్తాను. అమ్మ నువ్వు నన్ను 9 నెలలపాటు నీ కడుపులో పెట్టుకొని నన్ను పెంచావు. దానికి కూడా రుణం తీర్చుకోగలను అంటే చెప్పు నీకు కూడా ఎంతైనా ఇచ్చేస్తాను అని మాధవి అంటుంది. ఇక అక్కడి నుంచి మాధవి వెళ్ళిపోగానే తులసి నాకు నా కూతుర్ని కూడా దూరం చేసింది అని బాధపడుతుంది .
మరోవైపు సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి ఇల్లు వెతకడానికి వెళ్తారు. ఒక ఇల్లు ఫైనల్ గా సెలెక్ట్ చేసుకుంటారు. పొద్దున ఇంట్లో జరిగిన గొడవకి నందు వాళ్ల నాన్న బర్త్‌డేని సీక్రెట్ గా చేయాలని అనుకుంటాడు. ఇక మధ్య రాత్రిలో లేచి వాళ్ళ నాన్నకు హ్యాపీ బర్త్‌డే చెబుదామని అనుకుంటే అక్కడ వాళ్ళ నాన్న ఉండడు. ఇక రేపటి ఎపిసోడ్లో తులసి వాళ్ళ ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు సంబరాలు జరుగుతాయి. సామ్రాట్ తులసి ఉన్న ఇంటికి పరంధామయ్య వస్తాడు. పరంధామయ్య అక్కడికి రావడంతో తులసి ఘనంగా తన పుట్టినరోజు వేడుకలు చేస్తుంది .ఆ సెలబ్రేషన్స్ ను అభి సీక్రెట్ గా చూస్తూ వాళ్లపై కోపంతో రగిలిపోతూ కనిపిస్తాడు. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.