Intinti Gruhalakshmi: తులసి వాళ్ళ ఇంటికి వచ్చిన సామ్రాట్ ను తులసి లోపలికి రమ్మని పిలుస్తుంది. కానీ సామ్రాట్ లోపలికి రాకుండా బయట నిలబడతాడు. నిజంగా ఈ ఫైల్స్ కోసమే వచ్చారా అని తులసి సామ్రాట్ ని అనుమానిస్తూ అడుగుతుంది.. రేపు మా వీధిలో జరిగే దసరా సంబరాలకు హానిని తీసుకుని రండి అని సామ్రాట్ ను తులసి పిలుస్తుంది.. వేరే పనులు ఉన్నాయి అని సామ్రాట్ అంటాడు.. అయితే కనీసం హానిని అయినా పంపించమని అడిగింది.. సరే అని తులసి తో చెప్పి సామ్రాట్ అంటడు.. తులసిని బాధ పెడుతున్నానన్న బాధ సామ్రాట్ ను ఇంకా ఇంకా బాధ పెడుతుంది..
తులసి వాళ్ళింట్లో దసరా సంబరాలు చేయడానికి బతుకమ్మ ఎలా చేయాలో అందుకు కావలసిన పూలు అన్ని ప్రేమ్ తీసుకొస్తాడు.. ఇంతకీ బతుకమ్మ తయారు చేయడం ఎవరు నేర్పిస్తారు అని అడుగుతారు. అప్పుడే ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆ కష్టాల్లో అభయమిచ్చే ఆ ఆదిలక్ష్మి.. మా అమ్మ ఈ ఇంటి గృహలక్ష్మి అంటూ ప్రేమ్ తులసిని ఆకాశానికి ఎత్తేస్తాడు ప్రేమ్.. వహ్వా వహ్వా వన్స్ మోర్ అంటూ అంతా అంటారు.. పరంధామయ్య తులసి ఇంటి బాధ్యతలు తీసుకునే నీ కోడలకు బతుకమ్మ ఎలా చేయాలో నేర్పించమని అంటాడు.. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పూల పండుగ.. బతుకమ్మ అంటే బ్రతకమని ఆడపిల్లల్ని దీవించే పండుగ.. మన హీరోయిన్ తులసి బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పిన మాటలు విశేషంగా ఉంటాయి..
హనీ త్వరగా రా అమ్మ మీ నాన్న కింద నీకోసం ఎదురు చూస్తున్నాడు అని వాళ్ళ తాతయ్య అంటాడు ఆడవాళ్లు అంటే అంత త్వరగా అలా రెడీ అవుతారు మాకు అన్ని మ్యాచింగ్ ఉండాలి కదా ఇలా గొడవ చేస్తావ్ ఏంటి తాతయ్య అని హనీ అంటుంది నువ్వు చెప్పిన దాకా మీరు రెడీ అవ్వడానికి ఇంత కష్టం ఉంటుందని నాకు తెలియదు అమ్మ ఆ విషయాన్ని నేను ఆమెతో చెబుతాను అని వాళ్ళ బాబాయి అంటాడు.. సరే ఐదు నిమిషాల్లో అని వాళ్ళ ఇంటికి వస్తుంది అని తులసి గారికి ఫోన్ చేసి చెప్పు అని సామ్రాట్ అంటాడు.. అదేదో నువ్వే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.
తులసి ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వస్తారు.. చిచ్చు బుడ్డి ఫ్యామిలీ నందు, లాస్య కూడా రావడం చూసి మళ్ళీ ఏం యుద్ధం జరుగుతుంది అని అంతా అనుకుంటరు.. సామ్రాట్ ఈ సంబరాలకు రాలేదు అని తెలుసుకున్న లాస్య ఎలాగైనా సామ్రాట్ ని ఇక్కడికి రప్పించాలి అని హనీ ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక డ్రామా చేయాలి అని అనుకుంటుంది.. అప్పుడే హనీ తో కలిసి లాస్య ప్లాన్ చేసి సామ్రాట్ ను ఇక్కడికి రప్పించడానికి హనీకి కడుపునొప్పి అని తన ఫోన్లో నుంచి ఫోన్ చేసి చెప్పిస్తుంది.. ఇక సామ్రాట్ వచ్చాక ఆట రసవత్తరం చేయడానికి లాస్య ప్లాన్స్ లాస్యకు ఉన్నాయి..