Intinti Gruhalakshmi: నందు ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తున్నానని ఫోన్ చేస్తాడు. ఇక తులసి వంట తిని చాలా రోజులైంది. తనతో వంట చేయించమని కూడా చెబుతాడు . మాటలకి నందు కంగారు పడిపోతాడు తులసిని ఎలా ఒప్పించాలని నానా తంటలు పడతారు ఇక తులసి మూడు ఎలా ఉందో తెలుసుకోవాలని అనుక్షణం తన వెంట తిరుగుతూ ఉంటాడు అది చూసిన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోరకంగా అనుకుంటూ ఉంటారు..

ఇక అదే విషయాన్ని లాస్యతో చెప్పి తన సలహా తీసుకుంటాడు. ఆ ఫ్రెండ్ వచ్చినప్పుడు తులసి భార్య లాగా నా పక్కనే నటించమని చెబుతుంది. ఇక ఆ మాటలకు నందు కన్విన్స్ అవుతాడు. ముందు మీ అమ్మానాన్నలని ఒప్పించు వాళ్లే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తారని లాస్యను నందుకు సలహా ఇస్తుంది.

దివ్య ఇచ్చిన షార్ట్ ట్రీట్మెంట్ నుంచి ఇంకా విక్రమ్ తేరుకోలేక పోతాడు. అసలు తను ఎందుకు అలా తనని నానా మాటలు అనిందో విక్రమ్ కి ఇప్పటికీ పాలుపోదు. ఇక ఇంటికి వచ్చిన విక్రమ్ భోజనం చేయకుండా పైకి వెళ్ళిపోతుంటే .. భోజనం చేస్తున్న రాజ్యలక్ష్మి నువ్వు తినకపోతే నేను తినను అని లేస్తుంది వద్దమ్మా నేను తింటాను అని విక్రమ్ కింద కూర్చుంటాడు.
విక్రమ్ కి వడ్డిస్తున్న పనిమనిషిని అలాగేనా అన్నం వడ్డించేది అని కసురుకుంటాడు. దాంతో రాజ్యలక్ష్మి భోజనం తన చేతులతో తినిపిస్తుంది. విక్రమ్ నీ మూడు సరిగ్గా బాగోలేదు
అనుకుంటా.. నేను నీతో విషయం చెప్పాలి అని రాజ్యలక్ష్మి అంటుంది. చెప్పమ్మా అని విక్రమ్ అడుగుతాడు. రేపొద్దున నీకు పెళ్లి చూపులు అని చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో విక్రమ్ ని ఏ అమ్మాయితో అయితే చూసి దివ్య తప్పుగా అనుకుంటుందో ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని హాస్పటల్లో జాయిన్ చేస్తారు. తనకి ట్రీట్మెంట్ చేసి దివ్య నయం చేస్తుంది .
విక్రమ్ వల్లే కదా నీకు ఈ బాధ అని దివ్య అంటుంది . విక్రమ్ కలలో కూడా ఒకరికి హాని చేయడం చాలా మంచివాడు అని ఆమె చెబుతుంది. అనవసరంగా ఒక మంచి మనిషిని తప్పు పట్టాను అని దివ్య ఫీలయ్యి విక్రమ్ కి ఫోన్ చేస్తుంది. ఆ లోపు విక్రమ్ కి పెళ్లిచూపులు జరగడం ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడుతూ ఉండటం. ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని విక్రమ్ చెప్పటం చక చక జరిగిపోతాయి. ఇక ఏం జరుగుతుందో త్వరగా చూద్దాం.