NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ వచ్చేవారం సూపర్ ట్విస్ట్.!?

intinti-gruhalakshmi-serial-28-october-2022-today-775-episode-highlights

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. టీ ఆర్పీ రేటింగ్ లో కూడా ఇప్పటికే 776 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Intinti Gruhalakshmi serial latest episode highlights
Intinti Gruhalakshmi serial latest episode highlights

తులసి సామ్రాట్ తో కలిసి వైజాగ్ టూర్ వెళ్తుంది.. ఆ టూరే తులసి కొంప ముంచింది.. తులసి ఏ తప్పే చేయకపోయినా ఏదో తప్పు చేసిందనీ.. నందు, లాస్య, అనసూయమ్మ అనుమానం.. ఇప్పుడే అనూమనన్ని నిజం అని తులసి ఒప్పుకునే ప్రసక్తే లేదు.. ఎందుకుంటే తులసి ఆ తప్పు చేయలేదు కాబట్టి.. కానీ చేయని తప్పుకీ తులసిని అందరూ నిందిస్తారు.. నేను తప్పు చేయలేదు మొర్రో అని తులసి అంటున్నా ఒక్కరూ కూడా తులసి మాట వినరు.. మిమ్మల్ని నమ్మించే ఓపిక తీరిక నాకు లేదు.. నమ్మితే నమ్మండి లేదంటే లేదు అని తులసి అంటుంది..

tulasi request
tulasi request

నువ్వు అగ్నిపరీక్ష కు తుగాల్సిందే అని నందు అంటాడు.. రాముడు అగ్ని పరీక్ష పెడతాడు కానీ.. రావణాసురుడు కాదు అని తులసి తన విశ్వ రూపం చూపిస్తుంది.. అనసూయమ్మ కూడా నందు మాటలకు వత్తాసు పలుకుతుంది.. మీరు మాట్లాడకండి అత్తయ్య.. మీ అబ్బాయి పరాయి ఆడదాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టినప్పుడు మీ నోరు లేగవలేదు.. ఇప్పుడు ఎలా మాట్లాడతారు అని అంటుంది.. తులసి అనసూయమ్మ వైపు కోపంగా చూస్తూ.. చేయకూడని తప్పులు మీ కొడుకు మీ కోడలు ఇప్పటివరకు చేస్తున్నారు.. మీ సమక్షంలో వాళ్లు చాలా సార్లు చేశారు.. ఆవేశంలో నన్ను అన్నన్ని మాటలు అన్నారే.. నీ కొడుకుకి, కొడలుకి చేయండి సన్మానం అని అంటుంది తులసి..

ఇక అభి కూడా వాళ్ళ మాటలకు వత్తాసు పలుకుతూ.. మామ్ అని అభి మాట్లాడుతుండగా.. నోరుముయ్ అభి కొట్టానంటే వెళ్లి నీ అత్తారింట్లో పడతావు అని తులసి విరుచుకుపడుతుంది.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తులసి అంటుంది. మీలాంటి వాళ్ళ ముందు తులసి ఉన్న కూడా మీరు దానిని గంజాయి మొక్క లాగా చూస్తారు.. నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తులసి అంది..

tulasi shocked
tulasi shocked

తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కరెక్ట్ .. నా బిడ్డ ఈ ఇంట్లో ఇంకా ఈ మానసిక వేదనను అనుభవించనివ్వను.. నేను వెళ్ళిపోతున్నాను మావయ్య.. నన్ను క్షమించు అని తులసి అంటుంది.. నువ్వు ఉంటానన్నా నేను ఇంట్లో ఉండనివ్వనమ్మ .. ఈ ముగ్గురు నిన్ను మానసికంగా ఎలా చిత్రవధ చేసి ఉంటారు.. నాకు వీళ్ళని చూస్తుంటేనే అర్థం అవుతుంది అని పరంధామయ్య అంటాడు. అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అనసూయమ్మ అంటుంది.. ఏం జరిగిందో నేను వినకపోవచ్చు.. కానీ మీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మాత్రం నేను అర్థం చేసుకోగలను అని పరంధామయ్య అన్నాడు..

కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏంటిని గుడిగా మార్చేసావు.. కానీ వీళ్ళందరూ వీళ్ళ మాటలతో బజారుగా చేసేసారు.. దేవత ఎప్పుడూ గుడిలోనే ఉండాలి బజారు లో కాదు అని పరంధామయ్య తులసి తో అంటాడు.. అమ్మ నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ప్రేమ్ ని పిలవబోతుండగా.. ఎవరు ఏం చేసినా కానీ.. నేను అమ్మతో పాటే ఉంటాను అని ప్రేమ్ అంటాడు .. అమ్మ తులసి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఇంకా ఎవరైనా సరే నీ వైపు వేలెత్తి చూపిస్తే నువ్వు కాళీమాతలా వాళ్ళపై తిరగబడు అని పరంధామయ్య అంటాడు..

Intinti Gruhalakshmi serial latest episode highlights
Intinti Gruhalakshmi serial latest episode highlights

తులసి తన లగేజ్ తీసుకుని ఇంట్లో వాళ్లందరికీ వీడ్కోలు చెప్పి బయటకు వస్తుంది.. తులసి వెనకాల ప్రేమ్ కూడా వచ్చేస్తాడు.. అమ్మ మనం వెళ్లాల్సింది అటు కాదు ఇటు అమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు.. అని ప్రేమ్ అంటడు.. సరే అమ్మ నువ్వు నాకు ప్రామిస్ చెయ్ నువ్వు ఎటువైపు వెళ్లినా కూడా మళ్లీ నా దగ్గరికి తిరిగి వస్తానని మాట ఇవ్వు అని ప్రేమ్ మాట తీసుకుంటాడు.. పరంధామయ్య తులసి ఇంటికి రావాలి అని అఖండ జ్యోతి దీపాన్ని వెలిగించి ఆ దేవుడి ముందు ఉంచుతాడు.. తులసి మళ్లీ వచ్చేవరకు ఈ దీపం ఆరకుండా అలాగే వెలుగుతూ ఉంటుంది అని పరంధామయ్య అంటాడు.. తులసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి ఓ పార్క్ బెంచ్ మీద కూర్చుని ఉంటుంది.. అప్పుడే కృష్ణుడు రూపంలో వచ్చిన ఓ చిన్న పిల్ల వాడు నీకు బాధగా ఉందా అని అడుగుతాడు..

తులసి ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా తన పై వేసిన తప్పును నేను చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది.. ఇప్పుడు తులసికి మానసిక ఒత్తిడి తగ్గించి తనకి మార్గ నిర్దేశం చేయాలి.. అందుకే చిన్న పిల్ల వాడి రూపంలో ఆ కృష్ణ పరమాత్మ వచ్చాడు.. తనకి హితబోధ చేసి మంచి మార్గాన్ని ఎంచుకోమని చెబుతూ.. మళ్ళీ తనని తన ఇంటి వైపు అడుగులు వేసేలా చేస్తాడు..

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu