Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారలుగా ఈ సీరియల్ ఆ ప్లేస్ లో నిలుస్తూ ఈ వారం కూడా తన స్థానన్ని పదిలం చేసుకుంది.. ఈ సీరియల్లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందంటే.!?
తులసి వాళ్ళ ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ సంబరాలు ఆటపాటలతో ఇంకాస్త హుషారు తెప్పించడానికి ఒక బౌల్లో స్లిప్స్ తీసుకొని వస్తుంది.. అలా సామ్రాట్ స్లిప్ లో ఒక మంచి కథ చెప్పమని వస్తుంది.. ఈ రోజు ఆ వినాయకుడి మహిమల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు.. తన బిజినెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బ్రతిమిలాడుకున్నాడు.. తనే మాజీ భర్తని ఆఫీసులో తెలియనివ్వదు అని చెప్పాడు.. తను ఆ మాటకు కట్టుబడి ఉంది మౌనం వహించింది.. బాస్ ఆగడాలకు సహించింది.. చెయ్యని తప్పుకి ఆమె మాజీ భర్త ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తప్పులేదు అని సామ్రాట్ తన కథ నే కథగా చెబుతాడు.. తులసి గారు మీ బాస్ చేసిన తప్పులు క్షమిస్తూ రేపు మీరు ఆఫీస్ కి రండి అని సామ్రాట్ అంటాడు.. నేను ఎదురు చూస్తూ ఉంటాను.. బై అని సామ్రాట్ హానిని తీసుకుని వెళ్లి పోతడు..తులసి ఆ వినాయకుడి దగ్గరకు వెళ్లి రెండు చేతులతో నమస్కరించి వినాయకుడుకి దండం పెడుతుంది..
తులసి సామ్రాట్ మళ్లీ ఇద్దరు ఒకటవుతారు. సామ్రాట్ వాళ్ళ ఆఫీసులో ఎలాగైనా తమ ఉద్యోగాలు పోకుండా ఉండాలని లాస్య వెళ్లి సామ్రాట్ దగ్గరికి రిక్వెస్ట్ చేస్తుంది. నేను పెట్టే కండిషన్స్ కి నువ్వు ఒప్పుకుంటేనే మీరు ఇద్దరు ఈ జాబ్ లో ఉండడానికి అర్హులు.. అంతేకానీ నీ ఇష్టం వచ్చినట్లు ఇలా చేస్తే మాత్రం నా ఆఫీసులో ఉండటానికి వీలు లేదని సామ్రాట్ అంటాడు.. సామ్రాట్ మాటలకు లాస్య ఒప్పుకుంటుంది. మీరు చెప్పినట్లే వింటాను. మీ కండిషన్స్ అన్ని నాకు ఓకే అని లాస్య అంటుంది.. నందు సామ్రాట్ పై కావాలని కోపం పెంచుకుంటాడు.. దాంతో మందు తాగి వచ్చి తన కారు బ్రేక్ ఫెయిల్ చేస్తాడు.. కానీ నందు ప్లాన్ చేసినట్టుగా ఆ యాక్సిడెంట్ తులసికి సామ్రాట్ కి అవ్వదు.. హనీ కి సామ్రాట్కే అవుతుంది.. ఓపక్క తులసి సామ్రాట్ తో మాట్లాడుతుండగా ఆ యాక్సిడెంట్ జరుగుతుంది.. తులసి హనీ సామ్రాట్లను ఏ విధంగా కాపాడుతుంది.. ఆ యాక్సిడెంట్ అవ్వడానికి తన భర్త నందునే కారణం అని తెలుసుకున్న తులసి నందుని మరోసారి క్షమిస్తుందా.. ఈసారికి ఆ విషయం సామ్రాట్ కి చెప్పి కఠినంగా శిక్ష పడేలా చేస్తుందా.. లేదా అనేది వచ్చేవారం హైలెట్స్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు..