Intinti Gruhalakshmi: ప్రేమ్ ముగ్గుల పోటీలు ప్రైజ్ గురించి చాటింపు వేయగానే.. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు.. నిజంగానే గిఫ్ట్స్ ఇస్తావా అంటూ అల్లరి పట్టిస్తారు. తులసి వాళ్ళ ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. నందు ఇంటర్వ్యూ కి వెళ్లబోతుండగా.. తన చెల్లెలు మాధవి ఆ సంక్రాంతి సంబరాలు కి వస్తుంది. మాధవి తన భర్తతో కలిసి రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు..

ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు.. తులసి, అంకిత, శృతి, మాధవి, లాస్య, భాగ్య అంతా ముగ్గులు వేస్తారు.. తులసి రథం ముగ్గు వేస్తుంది. రథం ముగ్గు ప్రత్యేకత ఏంటో చెప్పమని దివ్య అడుగుతుంది ఇక తులసి రథం ముగ్గు, సంక్రాంతి రోజు ఎందుకు వేస్తారు. ఆ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెబుతుంది.

నందు తులసి రికమండేషన్ చేయించిన ఇంటర్వ్యూకి వెళ్తాడు.. వెతుక్కుంటూ ఈ ఆఫర్ వచ్చిందని నందు అక్కడ ఉన్న మిగతా వాళ్ళ అందరితో తన గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు మాధవి తన భర్త తులసికి థాంక్స్ చెబుతారు . మాధవి ఇక ఈ ఇంటి తో సంబంధం తెగిపోయింది అని చాలా సార్లు బాధపడింది.

కానీ నువ్వు ఫోన్ చేసి సంక్రాంతి సంబరాలకు పిలవగానే మాధవి ప్రాణం లేచిన వచ్చినంత పనైంది.. అని మాధవి భర్త తులసికి కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి ఉండాలని తులసి అనుకుంటుంది. అందుకే మాధవిని మళ్లీ ఇంటికి పిలుస్తుంది . నీ వల్ల మళ్ళీ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది అని మాధవి అంటుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో నందుకు ఈ జాబ్ వస్తుంది. అయితే అది తన టాలెంట్ వల్ల రాలేదని ఎవరో తులసి రికమండేషన్ చేస్తే నీకు ఈ జాబ్ వచ్చిందని నందుతో అక్కడికి వచ్చిన ఒక అతను అంటాడు. కోపంతో నందు జాబ్ ఆఫర్ లెటర్ చింపేస్తాడు. ఇక ఇంటికి వచ్చేసరికి తులసి సంక్రాంతికి దేవుడి పూజ చేస్తుంది. హారతి తీసుకోమని నందుకు ఇవ్వగానే కోపంగా ఉన్నా నందు తులసి ఇచ్చిన హారతి పలాన్ని ఉసిరి కొడతాడు. నిన్నేమైనా నేను ముష్టి అడిగానా జాబ్ ఇప్పించమని అని నందు తులసి పై విరుచుకుపడతాడు ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.