Krishnamma Kalipindi Iddarini: ప్రస్తుత కాలంలో పలు బుల్లితెర సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతూ ఎన్నో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తూ అందులో నటించే నటీనటులు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిందని చెప్పాలి.

ఇందులో నటిస్తున్న నటీనటులు తమ నటనతో సహజత్వం ఉట్టిపడేలా అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఇక మే 9 2023న మొదటిసారిగా స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఒడియా అందం జాస్మిన్ రాత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

తన నటనతో అందంతో యువతను భారీగా ఆకట్టుకుంటున్న ఈ చిన్నది మరొకసారి సోషల్ మీడియాలో సందడి చేసిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మీ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో కొన్ని ఫోటోలను పంచుకుంది. అందులో పట్టు చీర కట్టుకొని మరింత అందంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

పింక్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న ఈ చీర తన అందాన్ని మరింత రెట్టింపు చేసిందని చెప్పాలి. ఇకపోతే జాస్మిన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. సీరియల్ విషయానికి వస్తే స్టార్ జల్సా లో ప్రసారమైన సాంజేర్ బాతి అనే బెంగాలీ టీవీ షో కి ఇది రీమేక్.. దీనిని డైలీ తెలుగు సీరియల్ గా గుత్తా వెంకటేశ్వరరావు నిర్మించగా విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది మరొకవైపు ఇందులో నటీనటులు కూడా ఇలా సమయం దొరికితే తమ అందాలను ఆరబోస్తూ మరింతగా అభిమానులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే జాస్మిన్ సాంప్రదాయంగా కనిపించి మరొకసారి అందరిని తన అందంతో కట్టిపడేసింది.