Nuvvu Nenu Prema: స్టార్ మా చానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం గత కొన్ని నెలలుగా ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో నటించే నటీనటులు కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారని చెప్పవచ్చు.

ఇక సీరియల్ లోని నటీనటులు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఈ సీరియల్ చూసినంత సేపు మన కుటుంబంలో కూడా ఇలా జరుగుతుందా అన్న సందేహం వస్తుంది. అంత రియలిస్టిక్ గా కొనసాగుతోంది ఈ సీరియల్.

ఇకపోతే ఈ సీరియల్ లో నటిస్తున్న పద్మావతి క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పద్మావతి పాత్ర పోషిస్తున్న పవిత్ర బి నాయక్ తన అందంతో, నటనతో అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే స్టార్ మా లో ప్రసారం అయ్యే పలు కార్యక్రమాలలో కూడా ఈమె పాల్గొంటూ సందడి చేస్తోంది.ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొని తెగ సందడి చేసింది. అందులో భాగంగానే ఆమె రెడ్ కలర్ డ్రెస్ లో బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇక ఈ డ్రెస్ ధరించిన పవిత్ర ను చూసి యువత సైతం మోహితులవుతున్నారు.. తన అందంతో అద్భుతమైన డ్రెస్ సెన్స్ తో యువతను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే షోలో భాగంగా కమెడియన్ హరి తో కూడా ఆమె డాన్స్ చేసినట్లు అందుకు సంబంధించిన ఇన్ స్టాల్ రీల్స్ ను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే రెడ్ డ్రస్సులో చాలా అద్భుతంగా కనిపిస్తోంది పవిత్ర. సీరియల్స్ నటీనటులతో ప్రతివారం సందడి చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం ఈసారి ప్రేక్షకులను ఏ విధంగా అయరుస్తుందో చూడాలి.