Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండే.. గోపీచంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో.. వీరి హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అనంతరం గోపీచంద్ `సింగం` దర్శకుడు హరితో చేయబోతున్నాడట. సూర్య హీరోగా రూపుదిద్దుకున్న సింగం తమిళంతో పాటు తెలుగులోనూ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఇప్పుడు హరి లాంటి దర్శకుడితో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడట. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓకే చేసిన కథతో గోపీచంద్ సినిమా చేయనున్నాడట. `ఆర్ఆర్ఆర్` సినిమా ప్రారంభం అవ్వడానికి ముందుకు డైరెక్టర్ హరి ఓ అదిరిపోయే కథను ఎన్టీఆర్‌ను కలిశాడట.
ఆ కథ ఎన్టీఆర్‌కు బాగా నచ్చి.. సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. కానీ, ఆ తర్వాత ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` తో బిజీగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ లెక్కలన్నీ మారిపోయాయి. ఈయన రాబోయే సినిమాలన్నీ స్టార్ డైరెక్టర్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో హరి సినిమా అంటే జరగని పని. అందుకే హరి ఎన్టీఆర్ కోసం తయారు చేసిన కథను గోపీచంద్‌తో చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…