యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహైల్ కతురియాను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ఇప్పటికే తనకు కాబోయే వాడిని హన్సిక సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది.
డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్లోని 450 ఏళ్ల పురాతన రాచకోట `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్`లో హన్మిక-సోహైల్ వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. ఇరు కుటుంబసభ్యులు మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో హన్సిక సోహైల్ తో ఏడడుగులు నడవబోతోంది.
పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2 నుంచే ప్రారంభం అవుతాయని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హన్సిక తాజాగా ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుందట. అదేంటంటే.. పెళ్లి తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టేయాలని హన్సిక భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈలోపు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలను వదిలేసి.. భర్తతో బిజినెస్ చూసుకోవాలని హన్సిక అనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ ఈ వార్తలే నిజమైతే హన్సిక ఫ్యాన్స్ ఏ మాత్రం తట్టుకోలేరని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.