కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార-విగ్నేష్ శివన్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ జంట ఎట్టకేలకు జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి లో రజినీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి వంటి కోలీవుడ్ బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇకపోతే పెళ్లయిన కొద్ది రోజులకే వర్క్ తో బిజీ అయిపోయిన నయన్-విగ్నేష్ లు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వెకేషన్‌కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉండగా నయనతారకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
అదేంటంటే.. నయనతార గర్భం దాల్చిందని, ఆమె త్వరలోనే తల్లి కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ గా విగ్నేష్ తన ఇన్స్టాగ్రామ్ లో ముగ్గురు పిల్లలతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. అందుకు `పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం.. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేయాలి కదా` అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
దీంతో నయనతార గర్భం దాల్చిందని.. విగ్నేష్ పోస్ట్‌కు అర్థం అదే అంటూ వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే నయన్-విఘ్నేష్‌లు స్పందించాల్సిందే. కాగా, నయన్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `గాడ్ ఫాదర్` సినిమాలో నటించింది. అక్టోబర్ 5న దసరా పండగ కానుకగా ఈ మూవీ విడుదల కాబోతోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!