నిత్యా మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `అలా మొదలైంది` మూవీతో హీరోయిన్గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్‌తో అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించిన ఈ భామ.. సింగర్ గానూ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోన్న నిత్యా మీనన్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట.
మెట్లపై నుంచి పడిపోయిన నిత్యా మీనన్.. నడవలేని స్థితిలో హీరోయిన్!
ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో.. నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. అయితే నిత్యా మీనన్ పెళ్లాడబోయే అబ్బాయి కూడా నటుడే అట. మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వ్యక్తిని ఆమె వివాహం చేసుకోబోతోందట.
సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుండే నిత్యా మీనన్‌కు అతడితో పరిచయం ఉండేదట. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీయగా.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిందని అంటున్నారు. వీరి వివాహాన్ని ఇరు కుటుంబసభ్యులు సైతం అంగీకరించారట. అంతేకాదు, నిత్యా మీనన్ పెళ్లి విషయాన్ని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతోందని టాక్ నడుస్తోంది. మరి ఈ ప్రకటన వస్తేగానీ.. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు.